సమస్యలు పరిష్కరించాలి
● బెల్లంపల్లి మున్సిపల్ అధికారుల వేతనాలు ఆపి వేయండి ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: సీఎం ప్రజావాణి, జిల్లా ప్రజావాణిలో వచ్చిన అర్జీదారుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ తో కలిసి అర్జీలు స్వీకరించారు. పింఛన్, భూ సమస్యలు, పరిహారం తదితర వాటిపై పలువురు దరఖాస్తులు సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కాని బెల్లంపల్లి మున్సిపల్ అధికారుల వేతనాలు నిలిపి వేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతీ దరఖా స్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.


