Telangana Crime News: జీవితంపై విరక్తితో.. మహిళ తీవ్రనిర్ణయం..!
Sakshi News home page

జీవితంపై విరక్తితో.. మహిళ తీవ్రనిర్ణయం..!

Oct 6 2023 1:44 AM | Updated on Oct 6 2023 7:41 AM

- - Sakshi

మంచిర్యాల: జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రాజవర్థన్‌ వివరాల ప్రకారం.. మండలంలోని నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన దామరకొండ శంకరమ్మ (50) భర్త పర్వతాలు సంవత్సరం క్రితం మరణించాడు. అప్పటి నుంచి ఆమె నర్సింగాపూర్‌లోని స్వంత ఇంటి వద్ద ఒంటరిగా ఉంటుంది.

భర్త లేకపోవడంతో పాటు ఉన్న ముగ్గురు కుమారులు దగ్గర లేకపోవడంతో మానసికంగా కృంగిపోయింది. బుధవారం సాయంత్రం ఇంట్లోని పురుగుల మందు తాగి పడిపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపాడు.

ముఖ్య గమని​క:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement