స్టెప్‌ వేస్తే తెల్లార్లూ వేడుక.. | - | Sakshi
Sakshi News home page

స్టెప్‌ వేస్తే తెల్లార్లూ వేడుక..

Aug 28 2026 12:57 AM | Updated on Aug 28 2026 12:57 AM

స్టెప్‌ వేస్తే తెల్లార్లూ వేడుక..

ప్రిషా సింగ్‌, రాశీ సింగ్‌, విష్ణుప్రియ

‘అల్లరి’ నరేష్‌ హీరోగా నటించిన ఫ్యాంటసీ కామెడీ సినిమా ‘రంభ ఊర్వశి మేనక’. సురభి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రాశీ సింగ్‌, విష్ణు ప్రియ, ప్రిషా సింగ్‌ కీలక పాత్రల్లో నటించారు. చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వంలో రాజేష్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 4న విడుదల కానుంది. గురువారం ఈ సినిమాలోని ‘రంభ ఊర్వశి మేనక... స్టెప్‌ వేస్తే తెల్లార్లూ వేడుక..’ అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘మా ఊరు స్వర్గమండి... అది ఆకాశం అంచున ఉంటదండి..., అరె... దిగి వచ్చాం... పండగే చేసుకోండి...’ అంటూ సాగే ఈ పాటకు సురేష్‌ బనిసెట్టి సాహిత్యం అందించగా, విజయ్‌ పోలాకి కొరియోగ్రఫీ వహించారు. ఈ చిత్రసంగీత దర్శకుడు చేతన్‌ భరద్వాజ్‌ స్వరకల్పనలో ధనుంజయ్‌ సీపాన, సాహితీ చాగంటి ఈ పాటను పాడారు. సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో రాశీ సింగ్‌ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్‌లో నేను చేసిన డిఫరెంట్‌ సినిమా ఇది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అని చెప్పారు ప్రిషా సింగ్‌. ‘‘రంభ ఊర్వశి మేనకల చుట్టూ తిరిగే కథ ఇది’’ అని తెలిపారు విష్ణుప్రియ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement