ఏం జరుగుతుందో..?! | - | Sakshi
Sakshi News home page

ఏం జరుగుతుందో..?!

Aug 26 2026 1:12 AM | Updated on Aug 26 2026 1:12 AM

వనపర్తి: జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో కొన్ని రోజులుగా సాగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఇటీవల పార్టీ, తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే మేఘారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు క్రమశిక్షణ కమిటీ చర్యలకు సిఫార్సు చేయడం కలకలం సృష్టించింది. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ మల్లురవి ఆధ్వర్యంలో రూపొందించిన నివేదికను పార్టీ అధిష్టానానికి సమర్పించినట్లు తెలిసింది. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పిస్తూ.. చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో వనపర్తి కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాల వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పార్టీకి నష్టం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, చిన్నారెడ్డి గతంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన నేపథ్యంలో మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మల్లురవి అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత విభేదాలను పార్టీ వేదికలపైకి తీసుకురావొద్దని హితవు పలికారు. మరి చిన్నారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని.. కాంగ్రెస్‌ పార్టీలో అసలేం జరుగుతుందోనని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

చిన్నారెడ్డిపై చర్యలకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement