సమస్యలను వెంటనే పరిష్కరించాలి: ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

సమస్యలను వెంటనే పరిష్కరించాలి: ఎస్పీ

Aug 21 2026 7:15 AM | Updated on Aug 21 2026 7:15 AM

భూత్పూర్‌: పోలీస్‌స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను సత్వరం పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ జానకి ఆదేశించారు. గురువారం భూత్పూర్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆమె.. సర్కిల్‌ పరిధిలోని పోలీస్‌స్టేషన్ల పనితీరు, నేరాల పరిస్థితి, కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. ప్రజల్లో పోలీసులపై నమ్మకం మరింత పెరిగేలా బాధ్యతాయుతమైన, ప్రజానుకూల పోలీసింగ్‌ కొనసాగించాలని సూచించారు. నమోదవుతున్న నేరాలను విశ్లేషిస్తూ నేర నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. పాత నేరస్తులు, రౌడీషీ టర్లు, అనుమానితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సీఐ రామకృష్ణకు సూచించారు. భూత్పూర్‌, మూసాపేట, అడ్డాకుల, దేవరకద్ర, చిన్నచింతకుంట పరిధిలోని జాతీయ రహదారులపై నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణతో పాటు ట్రాఫిక్‌ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఐ, ఎస్‌ఐలను ఆదేశించారు. ఎస్‌ఐలు నాగన్న, విద్యా, మురళీ, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

విద్యార్థుల భవిష్యత్‌కు

బలమైన పునాది వేయాలి

మహమ్మదాబాద్‌: విద్యార్థుల అభ్యున్నతికి ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాల ని ఆర్జేడీ సోమిరెడ్డి సూచించారు. గురువారం మహమ్మదాబాద్‌ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశంలో మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచే విద్యా ర్థుల కు బలమైన పునాది కల్పిస్తూ.. పాఠ్యాంశాలపై ఆసక్తి పెరిగేలా బోధనలో నూతన పద్ధతులు అవలంబించాలని సూచించారు. చదువుతోపాటు సంస్కారం, క్రమశిక్షణ అలవర్చాలన్నారు. విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పు డు సమీక్షిస్తూ, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి పాఠశాల ఉత్త మ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోని దుకాణ సముదాయం అద్దెల ద్వారా వచ్చే ఆదాయాన్ని నిబంధనల ప్రకారం ఖర్చు చేయాలని సూచించారు. నిధుల దుర్వి నియోగంపై ఫిర్యాదులు రావడంతో పాఠశాలను సందర్శించిన ఆయన ఆదాయ, వ్యయ వివరాలను పరిశీలించారు. వచ్చిన ప్రతి రూపాయి, చేసిన ఖర్చుపై ఆడిట్‌ ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంఈఓ రాజునాయక్‌ పాల్గొన్నారు.

జిల్లాకు చేరిన

యూనిఫాం క్లాత్‌

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేయనున్న యూ నిఫాం క్లాత్‌ జిల్లాకు చేరింది. రంగుల్లో మార్పు లు చేయడంతో పంపిణీ కొంత ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని 805 ప్రభు త్వ పాఠశాలల్లో చదువుతున్న 65,515 మంది విద్యార్థులకు ఒక్కో జత యూనిఫాం కోసం 3.55 లక్షల మీటర్ల క్లాత్‌ చేరింది. ఈ ఏడాది నుంచి విద్యార్థులకు షూలను కూడా అందించనున్నారు. మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండలానికి తొలిసారిగా షూలు చేరాయి. ఇందులో 12,624 బ్లాక్‌ షూలు, 5,959 వైట్‌ షూలు ఉన్నాయి. గురుకుల విద్యార్థుల కోసం 9,967 బ్యాగులు కూడా అర్బన్‌ ఎంఈఓ కార్యాలయానికి చేరాయి. మరోవైపు భూత్పూర్‌ ఎంఆర్‌సీకి చేరిన కొత్త యూనిఫాం క్లాత్‌ను సీఎంఓ సుధాకర్‌రెడ్డి పరిశీలించారు.

23న కబడ్డీ జట్టు ఎంపిక

మహబూబ్‌నగర్‌ క్రీడలు: సూర్యాపేట జిల్లా కోదాడలో ఈనెల 11 నుంచి 13వరకు జరిగే రాష్ట్రస్థాయి సీనియ ర్‌ మహిళా కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొనే జి ల్లా సీనియర్‌ మహిళా జట్టు ఎంపికను ఈనెల 23వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షులు బి.శాంతికుమార్‌, ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడాకారిణులు ఆధార్‌కార్డుతో ఉదయం 9 గంటలకు మెయిన్‌ స్టేడియంలో రిపోర్టు చేయాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement