రేషన్‌ బియ్యం తూకంలో తేడా ఉండొద్దు | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం తూకంలో తేడా ఉండొద్దు

Aug 20 2026 3:46 AM | Updated on Aug 20 2026 3:46 AM

పాలమూరు: రేషన్‌ దుకాణాల్లో జరుగుతున్న బియ్యం తూకాల్లో తేడాలను, ఇతర అక్రమాలను జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారులు వెలుగులోకి తెచ్చారు. జిల్లా అధికారి రవీందర్‌ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని షాసాబ్‌గుట్ట ఏరియాలో ఉన్న మూడు రేషన్‌ దుకాణాలు ఆకస్మికంగా తనిఖీ చేయగా.. రెండు దుకాణాల్లో స్టాక్‌ లేకపోవడంతో స్టాక్‌ ఉండి పంపిణీ చేస్తున్న 35వ దుకాణంలో తనిఖీలు చేశారు. ఈ దుకాణంలో ఒక రేషన్‌కార్డుదారుడికి ఇచ్చిన 50 కిలోల బియ్యం బస్తాను మళ్లీ అక్కడే తూకం వేయగా 48.670 కిలోలు వచ్చింది. దీంతో బస్తా బరువు 560 గ్రాములు తీసివేయగా మరో 1.800 కిలోల బియ్యం కార్డుదారుడికి తక్కువగా ఇచ్చినట్లు తేలింది. దీంతో సదరు దుకాణ డీలర్‌పై తూనికలు, కొలతల శాఖ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారి వెల్లడించారు. ఈ క్రమంలో గోదాం నుంచే తక్కువగా వస్తుందని పలువురు డీలర్లు అధికారి దృష్టికి తీసుకువెళ్లడంతో అక్కడి నుంచి నేరుగా వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఉన్న గోదాం (స్టాక్‌ పాయింట్‌)లో తనిఖీ లు చేయగా అక్కడ సక్రమంగా ఉందని తేలింది. ప్రస్తుతం 3 నెలలకు సరిపడా బియ్య ం ప్రభుత్వం అందిస్తుండ గా కొందరు డీలర్లు తక్కు వ చేసి ఇస్తున్నట్లు తేలిందన్నారు. జి ల్లాలో డీలర్లు ఎవరైనా బియ్యం తక్కువ చేసి ఇస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల స్థాయి స్టాక్‌ పాయింట్‌ నుంచి రేషన్‌ దుకాణాలకు సక్రమంగా స్టాక్‌ పంపిణీ చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement