పిచ్చి కుక్క కరవడం వల్ల వెంటనే రోగం బయటపడదు. మెడపై, ముఖంపై కరిస్తే 15 రోజుల్లో, కాళ్లకు కరిస్తే ఆరు నెలల్లో రేబిస్ లక్షణాలు కన్పిస్తాయి. నరాల ద్వారా వైరస్ బ్రెయిన్‌కు చేరుకుని ఆ తర్వాత శరీరంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. కుక్క కరిచిన వెంటనే గాయాన్ని సబ్బుతో శుభ్రం చేసిన తర్వాత ఆస్పత్రికి వెళ్లి వైద్యుడి సూచనల మేరకే ఏఆర్‌వీ టీకాలు తీసుకోవాలి. కరిచిన రోజు మొదటి డోస్ మూడో రోజు రెండో డోస్, 7వ రోజు మూడో డోస్, 14వ రోజు నాలుగో డోస్, 28వ రోజు ఐదవ డోస్ కచ్చితంగా తీసుకోవాలి. ఈ డోస్ వల్ల శరీరంలో ఇమ్యూనిటీ శక్తి పెరిగి వైరస్‌ను నశింపచేస్తోంది. – డాక్టర్ శివానందస్వామి,
అసిస్టెంట్ డైరెక్టర్, పశు సంవర్ధకశాఖ
శనివారం ఉచిత వ్యాక్సినేషన్
పశు సంవర్ధకశాఖ కార్యాలయంలో ప్రతి ఏడాది యాంటీ రేబిస్ టీకాలు అందిస్తున్నాం. కుక్కల ఆరోగ్యం పూర్తిగా పరిశీలించిన తర్వాత ఇంజక్షన్స్ ఇస్తున్నాం. వీధి కుక్కలను మున్సిపల్ అధికారులు అధిక మొత్తంలో ఒక దగ్గర పట్టుకుని ఉంటే మా బృందం వెళ్లి టీకాలు ఇస్తుంది. వచ్చే శనివారం ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయంలో ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం భారీగా చేపడుతున్నాం.
– డాక్టర్ బి.మధుసూదన్‌గౌడ్, జిల్లా పశువైద్యాధికారి
●


