
అరు్హలందరికీ సంక్షేమ పథకాలు: కలెక్టర్
దేవరకద్ర రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించేలా క్షేత్రస్థాయిలో సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం పట్టణంలో దేవరకద్ర, కౌకుంట్ల మండలాలకు సంబంధించి నూతన రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి హాజరయ్యారు. అంతకుముందు పట్టణంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేషన్‌కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, పేర్ల మార్పులు, చేర్పుల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులకు కొత్త రేషన్‌కార్డు అందిస్తారన్నారు. జిల్లాకు 10 వేలకు పైగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. మొదటగా దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని మీనుగోనిపల్లికి చెందిన విజయమ్మ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నారని పేర్కొన్నారు. లబ్ధిదారులు ఇంటి నిర్మాణం కోసం ఎక్కువగా ఖర్చు చేయకుండా తమ స్థాయికి తగిన విధంగా నిర్మించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా మున్సిపాలిటీగా ఏర్పడిన దేవరకద్రను రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అత్యవసర పనుల నిమిత్తం రూ.3 కోట్లు మంజూరుకు సంబంధించి ఉత్తర్వులు వచ్చాయని, త్వరలోనే మరో రూ.15 కోట్లు మంజూరవుతాయని తెలిపారు. 100 పడకల ఆస్పత్రికి సంబంధించిన పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని, సంవత్సరంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కొత్తగా మంజూరైన డీగ్రీ కళాశాల భవనం స్థల పరిశీలన తుది దశలో ఉందని, వెంటనే నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, తహసీల్ధార్ కృష్ణయ్య, సుందర్‌రాజ్, ఎంపీడీఓ శ్రీనివాస్, అంజిల్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి, కిషన్‌రావు, ఫారుక్ తదితరులు పాల్గొన్నారు.