
ఏడాదిలో ‘రైల్వే’ ఫ్యాక్టరీ పూర్తి
విడతల వారీగా ఫ్యాక్టరీ సామర్థ్యం పెంపు
శ్రీవాత్సవ మీడియాతో మాట్లాడుతూ.. అలంపూర్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో సగభాగం మరమ్మతుకు లోనైన కోచ్‌లను బాగు చేస్తారని, ఫ్యాక్ట రీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 50 కోచ్‌లను మరమ్మత్తు చేస్తారని వివరించారు. అనంతరం ఈ ఫ్యాక్టరీ సామర్థ్యం 300 కోచ్‌లు మరమ్మత్తులు చేసేలా పెంచుతామని చెప్పారు. డబ్లింగ్ పనులు మొదటివిడతలో మహబూబ్‌నగర్ నుంచి దేవరకద్ర వరకు, రెండోవిడతలో జోగుళాంబ స్టేషన్ వరకు చేపడతామన్నారు. అమృత్ భారత్ స్కీంలో అభివృద్ధి చేసేందుకు కొన్ని రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని, ఇందులో గద్వాల రైల్వే స్టేషన్ ఒకటని చెప్పారు. ఈస్కీం కింద చేపడుతున్న పనులు జూన్ 2026 నాటికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. హైదరాబాద్ రైల్వే డివిజన్‌లో గద్వాల రైల్వే స్టేషన్ ముఖ్యమైనదని, గద్వాల నుంచి రైళ్ల పొడిగింపునకు అనేక వినతులు అందాయని, దీనిపై చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. జీఎం వెంట డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్, చీఫ్ ఇంజినీర్ నాగభూషణం, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ సాంబశివరావ్‌తో పలువురు అధికారులు ఉన్నారు. ఇదిలాఉండగా, జీఎంను సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ అసిస్టెంట్ డివిజన్ సెక్రటరీ రైల్వేశంకర్ కలిసి వినతిపత్రం అందించారు. గద్వాల రైల్వే ఉద్యోగుల కుటుంబాల కోసం వ్యాయామశాల, గ్రౌండ్ ఏర్పాటు చేయాలని, గ్యాంగ్‌మెన్‌లకు రెస్ట్, టూల్ రూంలు, ఎలక్ట్రికల్ భవనం స్థానంలో నూతన భవనాన్ని నిర్మించాలని, పెండింగ్‌లో ఉన్న జోనల్, డివిజన్, రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్స్ చేపట్టాలని కోరారు.
గద్వాల న్యూటౌన్/స్టేషన్ మహబూబ్‌నగర్/ఉండవెల్లి: అలంపూర్‌లో చేపడుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు జూన్ 2026 నాటికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మహబూబ్‌నగర్, గద్వాల, జోగుళాంబ రైల్వే హాల్ట్‌లకు చేరుకొని అక్కడ చేపట్టిన అభివృద్ధి పనుల మ్యాప్‌లు, నమూనాలను పరిశీలించారు. ముందుగా ప్రత్యేక రైలులో గద్వాలకు వచ్చిన జీఎం రైల్వేట్రాక్, పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యల వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన అధికారులతో కలిసి అమృత్ భారత్ స్కీం కింద చేపడుతున్న స్టేషన్, ప్లాట్‌ఫాం విస్తీర్ణం, ఆర్చి, వెహికిల్ పార్కింగ్, రోడ్ల పనులను పరిశీలించారు. వాటి పురోగతి గురించి అధికారుల ద్వారా వివరాలు ఆరా తీశారు.
అలంపూర్ రైల్వే కోచ్ పనులు వేగవంతం
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ
అమృత్ భారత్ స్కీం కింద చేపడుతున్న అభివృద్ధి పనుల పరిశీలన
మహబూబ్‌నగర్, గద్వాల, జోగుళాంబ రైల్వే హాల్ట్ సందర్శన

ఏడాదిలో ‘రైల్వే’ ఫ్యాక్టరీ పూర్తి