
మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, పీడీపై సస్పెన్షన్ వేటు
ధన్వాడ: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉమై ఆస్రాను సస్పెన్షన్ చేస్తూ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి ఉత్తర్వులు జారీచేశారు. అలాగే పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న పీడీ తులసీదాస్‌ను విధుల నుంచి తొలగిస్తూ గురువారం రాత్రి సంబంధిత అధికారులకు ఉత్తర్వులను పంపిచారు. గతవారం సాక్షిలో ‘‘మోడల్ స్కూల్ కంపు కంపు’’ శీర్షికపై స్పందించిన అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షించి విద్యార్థులు ఎందుకు ఆందోళన చేయాల్సి వచ్చింది.. మరుసటి రోజు పాఠశాల సమయంలో రోడ్డుపై రాస్తారోకో చేసేందుకు ఎలా అనుమతిచ్చారు అనే విషయాలపై ఉన్నతాధికారులకు వివరణ పంపిచారు. అయితే ఇక్కడ కేజీబీవీ టైపు–4 హాస్టల్‌లో విద్యార్థులు డ్రైనేజీ సమస్య, మరుగుదొడ్ల సమస్యపై అధికారులు స్పందించకపోవడంతో రాస్తారోకో చేశారు. కాని వీటిని పర్యవేక్షించే అధికారులు కేజీబీవీ ఎస్‌ఓపై మాత్రం ఎలాంటి చర్యలను తీసుకోకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.