
నాగర్‌కర్నూల్ కలెక్టర్‌కు మాతృవియోగం
నాగర్‌కర్నూల్: జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం సూరారం గ్రామానికి చెందిన నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాతృమూర్తి బదావత్ శాంతమ్మ(51) గుండెపోటుతో మృతిచెందారు. బుధవారం మధ్యాహ్నం ఆమెకు గుండెపోటు రాగా హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తర్వాత తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూరారం గ్రామానికి చేరుకుని శాంతమ్మ మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాగర్‌కర్నూల్ కలెక్టర్ సంతోశ్‌కుమార్‌ను పరామర్శించారు. కలెక్టర్ సంతోశ్‌కుమార్‌ను పరామర్శించిన వారిలో స్టేషన్‌ఘన్‌పూర్, కొల్లాపూర్ ఆ ర్డీఓ వెంకన్న, బన్సీలాల్ తదితరులు ఉన్నారు. కలెక్టర్ మాతృమూర్తి బదావత్ శాంతమ్మ అకాల మర ణంపై జిల్లా అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.