
ఇంజినీరింగ్ కళాశాలలో అడ్మిషన్లు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో నూతనంగా ప్రారంభించనున్న ఇంజినీరింగ్ కళాశాలలో ఎఫ్‌సెట్–2025 ద్వారా సీట్ల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందు లో ర్యాంకుల వారిగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ మేరకు గత వారం పీయూలో సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను విడుదల చేసింది. అందులో కోర్సుల వారిగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో 66 మందితో జాబితా విడుదల చేయగా 42 మంది ఆన్‌లైన్‌లో రిపోర్టు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్‌లో 64 మంది జాబితాలో ఉండగా 48 మంది, డాటా సైన్స్ విభాగంలో 63 మంది విద్యార్థులు జాబితాలో ఉండగా.. 46 మంది ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో సెల్ప్ రిపోర్టింగ్ చేశారు. మొత్తం 193 మంది విద్యార్థులను ప్రభుత్వం అలాట్ చేయగా ఇప్పటి వరకు 136 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ప్ రిపోర్టింగ్ చేశారు. కాగా రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు ఈ నెల 31 నుంచి వచ్చే నెల 1, 2వ తేదీల్లో నేరుగా పీయూలో రిపోర్టింగ్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవాలని ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇంజినీరింగ్ కళాశాలలో చేరిన బాల, బాలికలకు వేర్వేరుగా హాస్టల్ సదుపాయం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో సందేహాలు, సూచనల కోసం పీయూ ఇంజినీరింగ్ కళాశాల వద్ద హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు.
ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో సెల్ప్ రిపోర్టు చేసిన 136 మంది విద్యార్థులు