
సిబ్బంది సమయపాలన పాటించాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో పనిచేస్తున్న టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది అందరినీ సమానంగా చూస్తామని.. ఏ ఒక్కరి మీద ఎలాంటి చర్యలు తీసుకోమని వీసీ శ్రీనివాస్ అన్నారు. ‘సాక్షి’లో బుధవారం ‘పీయూలో ఏం జరుగుతోంది’ శీర్షికన ప్రచురితమైన కథనానికి వీసీ స్పందించారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ సమయాల్లో తప్పకుండా విధుల్లో ఉండాలని సిబ్బందికి ఇప్పటికే సూచించామని, ఆ ఆదేశాలకు అనుగుణంగా అంరూ పనిచేసి, అభివృద్ధి చెందుతున్న యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అంతేకాకుండా సిబ్బంది వేతనాలు పెంచేందుకు పూర్తిస్థాయిలో కృషిచేస్తున్నామని, తప్పకుండా నాన్‌టీచింగ్ సిబ్బందికి వేతనాలు పెంచుతామని పేర్కొన్నారు.
‘సాక్షి’లో ప్రచురితమైన కథనం