
జోగుళాంబ హుండీ ఆదాయం రూ.72 లక్షలు
అలంపూర్: అలంపూర్ ఆలయాల్లో హుండీల లెక్కింపు ద్వారా రూ.72 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి పురేందర్‌కుమార్ తెలిపారు. బుధవారం దేవాదాయ, ధర్మాదాయశాఖ సహాయ కమిషనర్ మదనేశ్వర్‌రెడ్డి, కార్యనిర్వాహక అధికారి పురేందర్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కొనసాగింది. 120 రోజుల హుండీని లెక్కించగా.. జోగుళాంబ అమ్మవారి ఆలయాల హుండీలో రూ.6,23,265, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయ హుండీలో రూ.9,76,819 వచ్చినట్లు పేర్కొన్నారు. అన్నదాన సత్రం హుండీ ద్వారా రూ.41,142.. క్షేత్ర ఆలయాల హుండీల ద్వారా మొత్తంగా రూ.72,50,619 ఆదాయం సమకూరినట్లు కార్యనిర్వాహక అధికారి వివరించారు. వీటితోపాటు విదేశీ కరెన్సీ, 20 గ్రాముల మిశ్రమ బంగారం, 380 గ్రాముల మిశ్రమ వెండి వచ్చినట్లు చెప్పారు. లెక్కింపులో ఆలయ ధర్మకర్తలు నాగ శిరోమణి, గోపాల్, జగన్మోహన్ నాయుడు, చంద్రశేఖర్‌రెడ్డి, జయరాముడు, ఆలయ ఉప ప్రధాన అర్చకుడు, ఎక్స్ అఫీషియో సభ్యుడు ఆనంద్‌శర్మ, ఆలయ అర్చకులు, సిబ్బంది, సేవా సంస్థలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.