
జూరాలను సందర్శించిన డీఐజీ చౌహాన్
ధరూరు: ప్రియదర్శిని జూరాల ఆనకట్టను బుధవా రం జోగులాంబ గద్వాల జిల్లా జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ సందర్శించారు. గద్వాల, వనపర్తి ఎస్పీలు శ్రీనివాసరావు, రావుల గిరిధర్‌తో కలిసి జూరాల వద్దకు చేసుకుని వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వర్షాల దృష్ట్యా ఎలాంటి విపత్తులు ఎవరైనా పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకుంటుందన్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తున్న వరద ప్రవాహంతో గద్వాల జిల్లా పరిధిలో 6 గ్రామాలకు, వనపర్తి జిల్లాలో 6 గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందన్నారు. చేపట్టాల్సిన చర్యలపై తగు సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రాజెక్టు వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం రేవులపల్లి పోలీసుస్టేషన్‌ను సందర్శించారు. కార్యక్రమంలో గద్వాల, వనపర్తి డీఎస్పీలు మొగులయ్య, వెంకటేశ్వర్లు, సీఐలు టంగుటూరు శ్రీను, రవిబాబు, రాంబాబు, ధరూరు, ఆత్మకూరు ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.