
కూలిన పాఠశాల పాత భవనం
నవాబుపేట: మండల పరిధిలోని కేశరావుపల్లి ప్రాథమిక పాఠశాల పాత భవనం ఇటీవల కురుస్తున్న వర్షాలకు కుప్పకూలింది. పాఠశాలలో కొత్త భవనంలోనే విద్యా బోధన కొనసాగు తుండటంతో పెను ప్రమాదం తప్పిందని వి ద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. పాఠశాల భవనానికి ఆనుకుని ఉన్న పాత భవనం మంగళవారం రాత్రి కూలింది. దీంతో గ్రామస్తులు బుధవారం పరిస్థితిని విద్యాశాఖ అధికారులకు వివరించారు. కాగా కూలిన భవనాన్ని వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారుల అనుమతులు తీసుకుని శిథిలాలు వెంటనే తొలగిస్తామని ఎంఈఓ నాగ్యానాయక్ పేర్కొన్నారు.