
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
బిజినేపల్లి: భార్య కాపురానికి రాలేదని మనస్థాపం చెందని భర్త చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని మమ్మాయిపల్లిలో చోటు చేసుకుంది. స్థానికు లు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన నక్క మైబూస్(32) భార్య అరుణకు మధ్య మనస్పర్థల కారణంగా అరుణ 15 రోజులుగా శాకాపూర్‌లోని తల్లి గారింట్లో ఉంటుంది. ఈ క్రమంలో భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపం చెందిన మైబూస్ గ్రామ శివారు లోని పొలాల వద్ద మంగళవారం రాత్రి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవా రం ఉదయం అటుగా వెళ్లిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మోతిఘన్‌పూర్‌లో
గంజాయి పట్టివేత
జడ్చర్ల: బాలానగర్ మండలంలోని మోతిఘన్‌పూర్‌లో గంజాయి విక్రయిస్తుండగా నిందితుడి ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎకై ్సజ్ సీఐ విప్తవరెడ్డి తెలిపారు. సీఐ కథనం మేరకు.. బీహార్‌కు చెందిన దినేష్‌సింగ్ మోతిఘన్‌పూర్‌లో అద్దె ఇంటిలో నివా సం ఉంటూ ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఇ టీవల బీహార్ వెళ్లిన సమయంలో అక్కడి నుంచి కిలో గంజాయిని తీసుకువచ్చి 5 గ్రాముల చొప్పున పాకెట్లను తయారు చేసి ఒక్కో ప్యాకె ట్‌ను రూ.300కు తోటి కార్మికులకు విక్రయిస్తున్నాడు. ఈక్రమంలో తమకు వచ్చిన సమాచారం మేరకు బుధవారం అతని ఇంటిలో తనిఖీలు నిర్వహించి అతని వద్ద నుంచి 250 గ్రా ముల గంజాయిని, సెల్‌ఫోన్‌ను స్వాధీన పర్చుకున్నారు. ఈమేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. దాడులలో ఎస్‌ఐ నాగరాజు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో
వ్యక్తి మృతి
జడ్చర్ల: కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి క్యూ రింగ్ చేసేందుకు నీరు పడుతుండగా ప్ర మాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన మండలంలోని పోలేపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా.. పోలేపల్లిలోని బీసీ కాలనీలో గురుకుంట రాములు(28)కు ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణ పనులు చేపట్టారు. ఇంటికి చేసిన సిమెంట్ నిర్మాణ పనులకు మోటార్ ఆన్ చేసి క్యూరింగ్ చేస్తుండగా విద్యుదాఘాతం సంభవించి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మృతుడికి భార్య స్వాతి, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద మరణించడంతో మృతుడి కుటుంబం ఒక్కసారిగా దుఖఃసాగరంలో మునిగింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంతో
లారీ డ్రైవర్ మృతి
కల్వకుర్తి రూరల్: పట్టణంలోని మంగళవారం రాత్రి విద్యుత్ షాక్ తో లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ మాధవరెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన నరసింహారావు (50) లారీ యజమాని అయినప్పటికీ డ్రైవింగ్ చేస్తారు. కొవ్వూరు నుంచి గోవా రాష్ట్రానికి లారీలో వెళుతూ.. కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్‌నగర్ చౌర స్తాలో లారీని ఆపి రోడ్డు అవతల ఉన్న పాన్‌షాప్‌కు వెళుతూ.. డివైడర్‌పై ఉన్న కరెంట్ స్తంభానికి ఉన్న వైరు పట్టుకున్నాడు. దీంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతుడి కు మారుడు సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
పెళ్లి కావడం లేదని
యువకుడి బలవన్మరణం
నాగర్‌కర్నూల్ క్రైం: పెళ్లి కావడం లేదని మనస్తాపంతో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ గోవర్ధన్ వివరాల మేరకు.. జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడి జిల్లా శిబువాడీ గ్రామానికి చెందిన మెహతాబ్ అన్సారీ (20) నాలుగేళ్లుగా జిల్లా కేంద్రంలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని టైల్స్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కళ్లు సరిగా కనపడకుండా పోయాయి. కుటుంబ సభ్యులు మెహతాబ్ అన్సారీకి ఇటీవల పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో కళ్లు కనబడటం లేదనే కారణంతో పెళ్లి సంబంధా లు కుదురకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి అన్న అఫ్తాబ్ అన్సారీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య