
జూరాలకు నిలకడగా వరద
ధరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద కాస్త తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవారం 1.02 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. బుధవారం రాత్రి 8 గంటల వరకు ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో 67వేల క్యూసెక్కులకు తగ్గినట్లు వివరించారు. ప్రాజెక్టు 4 క్రస్టు గేట్లను ఎత్తి గేట్ల ద్వారా 28,792 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 36,706 క్యూసెక్కులు, కోయిల్ సాగర్‌కు 315, భీమా లిఫ్టు–1కు 650, నెట్టెపాడుకు 750, ఆవిరి రూపంలో 69, ఎడమ కాల్వకు 820, కుడి కాలువకు 720, ఆర్‌డీఎస్ లింక్ కెనాల్‌కు 150, భీమా లిఫ్టు–2కు 750, సమాంతర కాల్వకు 200.. ప్రాజెక్టు నుంచి మొత్తం 69,122 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 9.398 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు.
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
జెన్‌కో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. బుధవారం 11 యూనిట్ల ద్వారా 435 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టినట్టు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 149.609 ఎంయు, దిగువలో 178.134 మొత్తం 327.743 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టినట్టు తెలిపారు.
కోయిల్‌సాగర్‌లో 24.6 అడుగులు
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. జూరాల నుంచి వస్తున్న నీటితో సమానంగా నీటి విడుదల కొనసాగడం వల్ల ప్రాజెక్టులో 24.6 అడుగుల మేర నీటిమట్టం వారం రోజులుగా కొనసాగుతుంది. ఎగువన చెరువులు నిండినా, పెద్ద వాగు నుంచి ప్రవాహం వచ్చినా ప్రాజెక్టు త్వరగా నిండే అవకాశం ఉంది. ప్రాజెక్టు అలుగు స్థాయి నీటి మట్టం 26.6 అడుగులు కాగా మరో 2 అడుగుల నీరు వస్తే అలుగు స్థాయికి చేరుతుంది.
సుంకేసుల వద్ద 8 గేట్ల ద్వారా నీటి విడుదల
రాజోళి: సుంకేసుల డ్యాంకు వరద క్రమంగా వస్తుండడంతో బుధవారం ఎనిమిది గేట్లను తెరిచి దిగువ కు విడుదల చేస్తున్నట్లు జేఈ మహేంద్ర తెలిపారు. ఎగువ నుంచి 43వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 36,975 క్యూసెక్కులు దిగువకు 1,540 క్యూసెక్కులు కేసీ కెనాల్‌కు వదులుతునట్లు పేర్కొన్నారు.
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి