
నీటి ప్రవాహాల వద్ద అప్రమత్తంగా ఉండాలి
జడ్చర్ల: వర్షాలు కురుస్తున్న సందర్భంగా చెరువులు, కుంటలు, వాగుల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి పేర్కొన్నారు. బుధవారం ఆమె లింగంపేట వద్ద దుందుభీ వాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయని, పొలాలకు వెళ్లే వారు, ఇతర అవసరాల కోసం వాగులు దాటే వారు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు, ఈత రాని వారు ఇలాంటి ప్రవాహాల వద్దకు వెళ్లడం మంచిది కాదన్నారు. చేపలు పట్టేందుకు కూడా వెళ్లవద్దన్నారు. ప్రజలు సురక్షితంగా ఉండాలన్నదే తమ భావన అని పేర్కొన్నారు. అనంతరం జడ్చర్ల సిగ్నల్‌గడ్డ వద్ద రోడ్డు విస్తరణ పనులను ఆమె పర్యవేక్షించారు. ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి స్థానిక పోలీసులకు తగు సూచనలు జారీ చేశారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ఎప్పటికప్పడు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎస్పీ వెంట సీఐ కమలాకర్, తదితర సిబ్బంది ఉన్నారు.
27న
పుస్తక ఆవిష్కరణ సభ
పాలమూరు: పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ హరగోపాల్ రచించిన శాంతి చర్చలు–ప్రజాస్వామిక అన్వేషణ పుస్తక ఆవిష్కరణ సభ ఈనెల 27న హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహిస్తున్నట్లు పాలమూ రు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి, జస్టిస్ కె.చంద్రకుమార్ హాజరవుతారని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి మేధావులు, వక్తలు అధికంగా హాజరుకావాలని కోరారు.
స్థానిక ఎన్నికలకు
సంసిద్ధం కావాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): స్థానిక సంస్థ ల ఎన్నికల నిర్వహణకు సంబంధిత అధికారు లు సంసిద్ధం కావాలని పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీజ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఇచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు. వనమహోత్సవం లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వించాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ భవనాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. వీసీలో జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీపీఓ పార్థసారధి, అడిషనల్ పీడీ సాయిదాబేగం పాల్గొన్నారు.
విద్యాసంస్థల బంద్
విజయవంతం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేప ట్టిన విద్యాసంస్థల బంద్ బుధవారం విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు విద్యార్థి సంఘాల నాయకులు పలు పాఠశాలలు, కళాశాలలను మూసివేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించలేదని, విద్యారంగ సమస్యలను పరిష్కరించే వారు లేకుండాపోయారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అనేక సమస్యలు ఉన్నా పట్టించుకోవడం లేదని, మూత్రశాలలు, తరగతి గదులు, తాగునీటి సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయని తెలిపా రు. స్కాలర్‌షిప్‌లు రూ.8 వేల కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతు న్నారన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, నూతన విద్యావిధానాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీ తీర్మానం చేయాలన్నారు. పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి సీతారాం, భాస్కర్, రాజు, భరత్, లక్ష్మణ్, వెంకటేష్, నాగేష్, సంజీవ్, నర్సింహులు, ప్రవీణ్‌కుమార్, వెంకటేష్, శ్రీనివాసులు, మల్లేష్, రాజు, రమేష్, నందు పాల్గొన్నారు.

నీటి ప్రవాహాల వద్ద అప్రమత్తంగా ఉండాలి

నీటి ప్రవాహాల వద్ద అప్రమత్తంగా ఉండాలి