
యూరియా కోసం.. పాసు పుస్తకాల క్యూ
ఒకపక్క వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతన్నలు యూరియాకు సైతం పాట్లు పడుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లోని పీఏసీఎస్‌కు గురువారం 600 బస్తాల యూరియా రాగా.. వందల సంఖ్యలో వచ్చిన రైతులు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోలేక ఇలా పాసు పుస్తకాలు పెట్టి ఒకపక్కన ఎదురుచూశారు. అధికారులు 600 బస్తాల యూరియా రావడంతో కొంతమంది రైతులకు అందజేసి చేతులు దులుపుకొన్నారు. వానాకాలం పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే పరిస్థితి ఇలా ఉంటే.. సమృద్ధిగా వర్షాలు కురిస్తే ఇంకెన్ని తిప్పలు పడాలోనని రైతులు నిట్టూర్పు విడిచారు. – మక్తల్