
జూరాలకు స్వల్పంగా వరద
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద కాస్త తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. బుధవారం 20 వేల క్యూసెక్కులు ఉండగా... గురువారం సాయంత్రానికి 15 వేల క్యూసెక్కులకు తగ్గినట్లు వివరించారు. జెన్‌కో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతుండగా.. 33,936 క్యూసెక్కుల నీరు వినియోగిస్తున్నామని, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్–1కు 1,300, నెట్టెంపాడుకు 750, ఆవిరి రూపంలో 84, ఎడమ కాల్వకు 1,250, కుడి కాల్వకు 500, ఆర్డీడఎస్ లింక్ కెనాల్‌కు 150, భీమా లిఫ్ట్–2కు 750, సమాంతర కాల్వకు 500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 6.492 టీఎంసీల నీటినిల్వ ఉందన్నారు.
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి..
ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది. గురువారం ఎగువన 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 129.213 మి.యూ, దిగువన 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 153.132 మి.యూ. ఉత్పత్తి చేపట్టామని ఎస్‌ఈ శ్రీధర్ వివరించారు. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 282.345 మి.యూ. ఉత్పత్తి చేపట్టామన్నారు.
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
దిగువకు 38,635 క్యూసెక్కుల
నీరు విడుదల