
విద్యార్థుల క్యాంపస్‌లు సురక్షితంగా ఉండాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా క్యాంపస్‌లు సురక్షితంగా ఉండాలని ఎస్‌ఎఫ్‌ఐ పీయూ అధ్యక్షుడు బత్తిని రాము పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీలు సురక్షితంగా లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఒడిషాలోని ఫకీర్‌మోహన్ కళాశాలలో ఓ విద్యార్థినీ ఆత్మహత్యకు పాల్పడిందని, పశ్చిమ బెంగాల్‌లో సౌత్ కళకత్తా లా కళాశాలలో ఓ విద్యార్థిపై హత్యాచారానికి పాల్పడ్డారని, మహారాష్ట్రలో ఓ పాఠశాలలో విద్యార్థిని దుస్తులు తీయించారని, ఇటువంటి ఘటనలు దేశంలో జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. తప్పు చేసిన వారిని కూడా నాయకులు కాపాడేందుకు ప్రయత్నించడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.