
ఇండోర్ స్టేడియానికి కొంత హంగులు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రం మెయిన్ స్టేడియంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియానికి నూతన శోభ ఉట్టిపడుతుంది. ఇప్పటికే అనేక క్రీడా వసతులున్న ఇండోర్ స్టేడియంలో ఇప్పుడు అధునాతనమైన మైక్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా యువజన, క్రీడల అధికారి శ్రీనివాస్ ఇండోర్ స్టేడియంలోని మైక్ సిస్టమ్‌ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రూ.42లక్షల నిధులతో ఇండోర్ స్టేడియంలో మైక్‌సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అధునాతనమైన జర్మన్ టెక్నాలజీతో కూడిన మైక్ సిస్టమ్ అమర్చినట్లు తెలిపారు. 16స్పీకర్‌లు, 8 యాంపిల్‌ఫైర్‌లు, 4 వూఫర్‌లు, 4 కార్డ్‌లెస్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నీలు జరిగే సమయంలో ఇలాంటి మైక్ సిస్టమ్‌తో ఎలాంటి రీసౌండ్ ఉందని, స్పష్టమైన సౌండ్ వస్తుందన్నారు. ఇండోర్ స్టేడియంలో సోలార్ విద్యుత్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర క్రీడల వ్యవహారాల సలహాదారులు ఏపీ జితేందర్‌రెడ్డిని కలిసి సోలార్ విద్యుత్ ఏర్పాటు గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. త్వరలో ఇండోర్ స్టేడియంలో సోలార్ విద్యుత్ ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నారు. మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో అధునాతనమైన సౌకర్యాలు కల్పిస్తుండడంపై జిల్లాలోని క్రీడాకారురులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ.42లక్షలతో అధునాతనమైన మైక్‌సిస్టమ్ ఏర్పాటు
సోలార్ విద్యుత్‌కు ప్రతిపాదనలు