వికసించిన బ్రహ్మ కమలాలు | - | Sakshi
Sakshi News home page

వికసించిన బ్రహ్మ కమలాలు

Jun 16 2025 7:01 AM | Updated on Jun 16 2025 7:01 AM

వికసించిన బ్రహ్మ కమలాలు

వికసించిన బ్రహ్మ కమలాలు

జడ్చర్ల: హిందూ సంస్కృతిలో బ్రహ్మకమలం మొక్కను చాలా పవిత్రమైందిగా భావిస్తారు. బ్రహ్మ కమలాలను శివుడికి సమర్పిస్తే ప్రసన్నమై కోరికలు నెరవేరుస్తారని శివ భక్తుల విశ్వాసం. ఎక్కువగా హిమాలయాలు, ఉత్తర బర్మా, టిబెట్‌, నేపాల్‌, చైనా దేశాల్లో పెరిగే బ్రహ్మకమలాలు జడ్చర్లలో ఆదివారం రాత్రి వికసించాయి. స్థానిక శ్రీనివాస థియేటర్‌ సమీపంలో నివాసముంటున్న రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి మల్లికేడి కొండాజి, విజయలక్ష్మి దంపతుల ఇంటిలో ఏకంగా 14 పుష్పాలు వికసించాయి. దీంతో కుటుంబ సభ్యులు బ్రహ్మకమలాలకు ప్రత్యేక పూజలు చేశారు. విషయం తెలుసుకున్న చుట్టు పక్కల వారు బ్రహ్మకమలాలను చూసి సంబురపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement