హోరాహోరీగా ఖోఖో పోటీలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో 43వ రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లా జూనియర్ ఖోఖో పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. మంగళవారం రెండో రోజు పోటీలను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు క్రీడా జట్లను పరిచయం చేసుకొని అభినందించారు. అనంతరం టోర్నమెంట్ నిర్వాహకులు ఎమ్మెల్యే, చైర్మన్లను ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి జీఏ.విలియం, కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్.బాల్‌రాజు, టీజీపెటా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దూమర్ల నిరంజన్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, రిటైర్డ్ పీడీ యూ.శ్రీనివాసులు, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, జిల్లా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షులు మహ్మద్ అవేజ్ అహ్మద్ పాల్గొన్నారు.
రెండో రోజు ఫలితాలు
బాలుర విభాగంలో ఆదిలాబాద్ జట్టు 36–24 పా యింట్ల తేడాతో ఖమ్మం జట్టుపై, మెదక్ జట్టు 28 –24 తేడాతో కరీంనగర్‌పై, వరంగల్ జట్టు 30–20 పాయింట్ల తేడాతో నల్లగొండపై, రంగారెడ్డి జట్టు 22 –18 తేడాతో మహబూబ్‌నగర్‌పై, ఆదిలాబాద్ జట్టు 24–14 తేడాతో హైదరాబాద్‌పై, మెదక్ జట్టు 36– 30 తేడాతో నిజామాబాద్ జట్లపై గెలుపొందాయి.
బాలికల విభాగంలో ఆదిలాబాద్ జట్టు 24–4 పా యింట్ల తేడాతో ఖమ్మంపై, మెదక్ జట్టు 14–12 తేడాతో కరీంనగర్‌పై, నల్లగొండ జట్టు 20–8 తేడా తో మహబూబ్‌నగర్‌పై, ఆదిలాబాద్ జట్టు 36–2 తే డాతో నిజామాబాద్‌పై, రంగారెడ్డి జట్టు 24–8 తేడా తో మెదక్‌పై, మెదక్ జట్టు 36–30 పాయింట్ల తేడా తో నిజామాబాద్ జట్లపై విజయం సాధించాయి.
హోరాహోరీగా ఖోఖో పోటీలు


