
నిందితులు రిమాండ్‌కు..
పాన్‌గల్: మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో సామగ్రి చోరీచేసిన నిందితులను అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ వేణు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించారు. గత నెల 28వ తేదీ అర్ధరాత్రి సబ్‌స్టేషన్‌లో పెబ్బేర్‌కు చెందిన 8 మంది సామగ్రిని ఎత్తుకెళ్లారు. సోమవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానితులుగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు. వీరితోపాటు మరో ఆరుగురు ఉన్నట్లు గుర్తించి ఐదుగురిని అదుపులోకి తీసుకొని చోరీ సమయంలో వినియోగించిన రెండు ఆటోలు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించినట్లు వివరించారు. అదేవిధంగా ఎత్తుకెళ్లిన సామగ్రిని రికవరీ చేశామన్నారు. చోరీకి పాల్పడిన వారిలో డక్కలి పెద్ద లింగన్న, డక్కలి ఉపేంద్ర, డక్కలి కార్తీక్, కర్నె విశాక్, కర్నె అంజన్న, డాకూరి శ్రీను అలియాస్ సురేందర్, మహంకాళి కిశోర్‌ను రిమాండ్‌కు తరలించగా ఒకరు పరారీలో ఉన్నారన్నారు. కేసును ఛేదించిన తనతో పాటు సిబ్బంది రాంగోపాల్‌వర్మ, హజీబాబా, అంజి, టెక్ టీం మురళిని సీఐ నాగభూషణ్‌రావు అభినందించినట్లు పేర్కొన్నారు.
కడుపులో కణితి తొలగింపు
అచ్చంపేట రూరల్: కొత్తపల్లికి చెందిన నేనావత్ రాంలాల్ కడుపులో కణితి ఉందని తేలడంతో విషయాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు. కాగా వైద్యుడైన ఎమ్మెల్యే మంగళవారం అచ్చంపేట ప్రాంతీయ ఆస్పత్రిలో శస్త్రచికిత్స కోసం ఏర్పాట్లు చేయాలని అక్కడి వైద్యులకు సూచించారు. వారి సాయంతో స్వయంగా శస్త్రచికిత్స చేశారు. కాగా ఎమ్మెల్యే ప్రభుత్వాస్పత్రిలో ఇప్పటికే ఎనిమిది శస్త్రచికిత్సలు చేయడం గమనార్హం.

నిందితులు రిమాండ్‌కు..