
అడ్డాకుల: జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారిపై వాహనాల తనిఖీని ముమ్మరంగా చేస్తూ నిరంతరం నిఘా ఉంచాలని ఎస్పీ హర్షవర్ధన్ పోలీసులను ఆదేశించారు. అడ్డాకుల మండలం శాఖాపూర్ టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టును బుధవారం ఆయన పరిశీలించారు. చెక్‌పోస్టు వద్ద పోలీసులు చేస్తున్న తనిఖీలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రధానంగా రహదారిపై డబ్బులు, మద్యం సరఫరా చేసే వాహనాలపై నిఘా పెంచాలని సూచించారు. అనంతరం అడ్డాకుల పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట ఎస్‌ఐ మాధవరెడ్డి తదితరులున్నారు.
తగ్గని ఉల్లి ధర
● గరిష్టంగా రూ.6 వేలు, కనిష్టంగా రూ.5,500
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధర ఏమాత్రం తగ్గలేదు. గత వారం నమోదైన ధరలే మళ్లీ వచ్చాయి. వేలంలో క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6 వేలు, కనిష్టంగా రూ.5,500 పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్‌కు తక్కువగా ఉల్లి రావడంతో కొందరు వ్యాపారులు ఇతర మార్కెట్‌లలో కొనుగోలు చేసిన ఉల్లిని తెచ్చి నేరుగా అమ్ముకున్నారు. 45 కిలోల బస్తా రూ.3 వేల నుంచి రూ.2,750 వరకు విక్రయించారు. కొత్తగా దిగుబడి వచ్చిన ఉల్లిని కూడా బస్తా ధర రూ.2,500 వరకు అమ్మారు.
మార్కెట్‌లో నిండిన ధాన్యం రాసులు
వరి కోతలు ప్రారంభమై దిగుబడులు రావడంతో రైతులు పెద్దఎత్తున మార్కెట్‌కు ధాన్యం అమ్మకానికి తెచ్చారు. బుధవారం వివిధ గ్రామాల నుంచి 10 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. మంగళవారం ఖరీదు చేసిన ధాన్యం తూకాలు ముగిసిన లోడింగ్ చేయకపోవడంతో మార్కెట్‌లో ఒకవైపు కుప్పలుగా పోసిన ధాన్యం ఉండగా.. మరోవైపు తూకాలు వేసిన ధాన్యం బస్తాలతో నిండిపోయింది. సోనామసూరి ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,223, కనిష్టంగా రూ.1,909గా ధ రలు నమోదయ్యాయి. హంస గరిష్టంగా రూ. 1,950, కనిష్టంగా రూ.1,711 పలికింది. ఆముదాల ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.5,309, కనిష్టంగా రూ.5,209 ధరలు వచ్చాయి.
