భారీగా నగదు సీజ్‌ | Sakshi
Sakshi News home page

భారీగా నగదు సీజ్‌

Published Fri, Nov 3 2023 1:44 AM

- - Sakshi

గద్వాల క్రైం: జిల్లావ్యాప్తంగా గురువారం చేపట్టిన వాహనాల తనిఖీల్లో రూ.3,22,500 నగదును గుర్తించి సీజ్‌ చేసినట్లు ఎస్పీ రితిరాజ్‌ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో రూ.50 వేల కంటే ఎక్కువ నగదును తరలికూడదని తెలిపారు.

వనపర్తి: జిల్లావ్యాప్తంగా చేపట్టిన వాహనాల తనిఖీల్లో రూ.4 లక్షల నగదు, 9 లీటర్ల మద్యం, 51 కేజీల నల్లబెల్లం పట్టుకుని సీజ్‌ చేసినట్లు ఎస్పీ రక్షితా కె.మూర్తి వెల్లడించారు. పెద్దమందడి మండలం వెల్టూరు చెక్‌పోస్టు వద్ద రూ. 4లక్షల నగదు, ఖిల్లాఘనపురంలో 9 లీటర్ల మద్యం, వనపర్తి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 51 కేజీల నల్లబెల్లం పట్టుబడినట్లు తెలిపారు.

జడ్చర్ల: పట్టణంలోని క్లబ్‌ రోడ్డులో తరలిస్తున్న రూ.9లక్షల నగదును పట్టుకుని సీజ్‌ చేసినట్లు సీఐ రమేష్‌బాబు తెలిపారు. బ్యాంకులో డ్రా చేసిన నగదును బాదేపల్లికి చెందిన వంశీధర్‌రెడ్డి తన వాహనంలో తరలిస్తుండగా, పట్టుకుని ఎన్నికల అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

కృష్ణా: మండలంలోని చేగుంట చెక్‌పోస్టు వద్ద రూ.2,47,479 నగదును పట్టుకుని సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ విజయభాస్కర్‌ తెలిపారు. రాయచూర్‌ నుంచి గుర్మిట్‌కల్‌కు నీలకంఠ పాటిల్‌ అనే వ్యక్తి నగదును తరలిస్తుండగా, పట్టుకుని నారాయణపేట్‌ గ్రీవెన్స్‌ కమిటీకి అప్పగించినట్లు పేర్కొన్నారు.

మాగనూర్‌: మరికల్‌ మండలం మాదారం గ్రామానికి చెందిన ఉప్పు రాము తన వాహనంలో రూ.లక్ష 40వేలు తరలిస్తుండగా, మాగనూర్‌లో పట్టుకున్నట్లు ఎస్‌ఐ మల్లేష్‌ తెలిపారు.

ఊట్కూర్‌: పగిడిమారికి చెందిన వెంకటేష్‌ తన వాహనంలో రూ.లక్ష నగదు తరలిస్తుండగా, మండల కేంద్రంలోని చెక్‌పోస్టు వద్ద పట్టుకుని సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ గోకారి తెలిపారు.

Advertisement
 
Advertisement