భయం గుప్పిట్లో చదువులు..! | - | Sakshi
Sakshi News home page

భయం గుప్పిట్లో చదువులు..!

Jul 20 2023 1:12 AM | Updated on Jul 20 2023 8:21 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌: నారాయణపేట జిల్లా మద్దూరులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సోమవారం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే పాఠశాలకు సోమవారం సెలవు కావడం, విద్యార్థులు బడిలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఒక్క చోటే కాకుండా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎన్నో పాఠశాలలు శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి దాపురించింది.

మంగళవారం కూడా ఎడతెరిపి లేకు ండా వాన ముసురు కురవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొన్ని పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులను మధ్యాహ్నం నుంచే ఇళ్లకు పంపించా రు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కుస్తున్న నేపథ్యంలో పాఠశాలల నిర్వహణ విషయంలో జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచిస్తున్నారు.

ప్రమాదకరంగా..

మ్మడి జిల్లాలోని 3,162 ప్రభుత్వ పాఠశాలల్లో 2 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఇందులో కొన్ని శిథిలావస్థకు చేరిన పాఠశాలల్లో పైకప్పు పెచ్చులూడడం, నెర్రెలు రావడంతో వర్షం వచ్చిన ప్రతిసారి తరగతి గదల్లోకి వర్షపు నీరు చేరుతుంది. దీంతో కొన్నిచోట్ల పైకప్పు పెచ్చులు ఊడి పడుతుండగా.. మరికొన్నిచోట్ల భవనాలే కూలిపోతా యా అన్న ప్రమాదకరంగా మారాయి.

ఇప్పటికే పలు చోట్ల పైకప్పు పెచ్చులు ఊడిపడగా.. విద్యార్థులు గా యపడటం, త్రుటిలో ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడిన సందర్భాలు లేకపోలేదు. అలాగే కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు సైతం ప్రత్యేక గదులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement