మడగూడెం పాఠశాల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

మడగూడెం పాఠశాల తనిఖీ

Nov 29 2026 2:05 PM | Updated on Nov 29 2026 2:05 PM

గంగారం: మండలంలోని మడగూడ ఆశ్రమోన్నత పాఠశాలను ఏటూరునాగారం ఐటీడీఏ డిప్యూటీ ఈఓ ఈరులాల్‌ శనివారం తనిఖీ చేశారు. హెచ్‌ఎం ధనసరి రాంమూర్తి, డిప్యూటీ వార్డెన్‌ జెజ్జరి లక్ష్మీనర్సు, ఉపాధ్యాయులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం విద్యార్థులకు వర్క్‌ బుక్‌, పుస్తకాలను డీప్యూటీ ఈఓ ఈరులాల్‌ చేతుల మీదుగా అందించారు.

పాఠశాలలో మాక్‌ పార్లమెంట్‌

దంతాలపల్లి : మండల కేంద్రంలోని పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులు మాక్‌ పార్లమెంట్‌ నిర్వహించారు. ప్రజాస్వామ్య విలువలు, చట్టసభల నిర్వాహణపై అవగాహన కల్పించేందుకే విద్యార్థులకు మాక్‌ పార్లమెంట్‌ ఏర్పాటు చేసినట్లు ప్రధానోపాధ్యాయుడు వేణుమాధవ రెడ్డి తెలిపారు.

వికాస్‌ హైస్కూల్‌లో మాక్‌ గ్రామసభ

తొర్రూరు రూరల్‌ : మండలంలోని వెలికట్ట గ్రామ శివారులో గల వికాస్‌ హైస్కూల్‌లో శనివారం విద్యార్థులు మాక్‌ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్‌ కరస్పాండెంట్‌ తాళ్లపల్లి రమేష్‌గౌడ్‌ మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు గ్రామ పరిపాలనపై అవగాహన కలిగి ఉండాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. డైరెక్టర్‌ కేవి రెడ్డి, ప్రిన్సిపాల్‌ నాగరాజు, వైస్‌ ప్రిన్సిపాల్‌ రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

రెడ్యాల ఆశ్రమ పాఠశాలలో మాక్‌ అసెంబ్లీ

మహబూబాబాద్‌ అర్బన్‌ : మహబూబాబాద్‌ మండలంలోని రెడ్యాల గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో శనివారం మాక్‌ అసెంబ్లీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం సక్రు మాట్లాడుతూ.. విద్యార్థులు శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష, అధికారపక్షాల మధ్యలో పలు అంశాలపై చర్చలు కొనసాగించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బాధ్యతల స్వీకరణ

గార్ల : గార్లలోని సివిల్‌ సప్లయీ గోదాం డిప్యూటీ తహసీల్దార్‌గా చీమల ఆదినారాయణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. మరిపెడ మండలంలో ఎలక్షన్‌ డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసి బదిలీపై గార్లకు వచ్చినట్లు పేర్కొన్నారు.

విద్యుత్‌ తీగలు తగిలి.. ట్రాక్టర్‌, గడ్డి దగ్ధం

కురవి : మండలంలోని ఎల్కచెట్టు గ్రామ పరిధిలోని మంచ్యాతండాలో శనివారం విద్యుత్‌ తీగలు తగిలి మంటలు చెలరేగి ట్రాక్టర్‌తోపాటు వరిగడ్డి పూర్తిగా దగ్ధమైంది. మంచ్యా తండాలో రైతు దేవ్‌సింగ్‌కు చెందిన గడ్డిని గుగులోత్‌ హమ్మికి చెందిన ట్రాక్టర్‌లో ఇంటికి తీసుకువస్తున్నారు. ఈక్రమంలో ట్రాక్టర్‌పై విద్యుత్‌ తీగలు వేలాడుతూ గడ్డికి తగలడంతో నిప్పురవ్వలు ఎగిరిపడి గడ్డి అంటుకుంది. దీంతో మంటలు వ్యాపించి గడ్డిమెత్తం కాలిబూడిదైంది. గడ్డితోపాటు ట్రాక్టర్‌ ఇంజన్‌ సైతం పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో భూక్య హథీరాంకు మంటలు తగిలి గాయాలయ్యాయి. సుమారు రూ.15లక్షల మేర నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. వీటితోపాటు సంఘటన పక్కనే పొలం వద్ద ఉన్న ఐదు పుట్ల వరిధాన్యం సైతం కాలిపోయింది.

గుండెపోటుతో వ్యక్తి మృతి

మరిపెడ : గుండెపోటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన జర్పుల వీరన్న (51) డీజే సౌండ్‌ సిస్టం వర్కర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వీరన్న మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వీరన్నకు భార్య, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement