ఏజెన్సీ ప్రాంతంలో విద్యుత్‌ కలేనా? | - | Sakshi
Sakshi News home page

ఏజెన్సీ ప్రాంతంలో విద్యుత్‌ కలేనా?

Nov 29 2026 2:05 PM | Updated on Nov 29 2026 2:05 PM

సబ్‌స్టేషన్‌, విద్యుత్‌ లైన్ల ఏర్పాటును అడ్డుకుంటున్న అటవీశాఖ

కొత్తగూడ : కొత్తగూడ, గంగారం మండలాల ఏజెన్సీ గ్రామాలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్తగూడ మండలం బత్తులపల్లి, గంగారం మండలం కోమట్లగూడెం గ్రామాల్లో 33/11 కేవీ మూడు సబ్‌ స్టేషన్లు, రెండు మండలాల్లో ఉన్న పాత, కొత్త సబ్‌స్టేషన్‌లకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఇల్లెందు నుంచి నేరుగా గంగారం మండలం మడగూడెం గ్రామంలో 133/11 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి నిధులు కేటాయించి టెండర్లు నిర్వహించింది. నిర్మాణ అనుమతులకు కావాల్సిన స్థల సేకరణ పూర్తయింది. స్థల సేకరణ సమయంలో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వండంతో పాటు గ్రామసభలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేశారు. అప్పుడు రెవెన్యూ శాఖ ఇచ్చిన నివేదికలకు అటవీ శాఖ సమ్మతించింది. టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించారు. సబ్‌ స్టేషన్లను నిర్మించేందుకు పునాదులు తీశారు. ఆపరేటర్‌ గదులు నిర్మించారు.

అటవీ శాఖ అడ్డంకులు

కాగా సబ్‌స్టేషన్‌ నిర్మాణం కోసం ఇచ్చిన స్థలంలో కొంత అటవీ శాఖకు ఉందని, విద్యుత్‌ లైన్లు మొత్తం అటవీ భూముల నుంచి వెళ్తున్నాయని అడ్డంకులు చెబుతూ పనులు నిలిపివేశారు. దీంతో రెండేళ్లుగా సబ్‌ స్టేషన్ల నిర్మాణం పూర్తి కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రుళ్లు ఏదైనా లైన్‌ సమస్య వచ్చిందంటే అన్ని గ్రామాలకు అంధకారం అలముకుంటుంది. దీన్ని అధిగమించేందుకు మంత్రి సీతక్క చొరవతో సబ్‌ స్టేషన్లకు నిధులు మంజూరు చేసి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. కాని అటవీ శాఖ అధికారులు మాత్రం అడ్డుకుంటున్నారు. అధికారుల తీరుపై ఏజెన్సీ ప్రజలు, ఆదివాసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీ గూడాలకు క నీసం విద్యుత్‌ సరఫరా కూడా చేయకుండా అడ్డుకో వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు చొ రవ తీసుకుని సబ్‌ స్టేషన్‌ నిర్మాణాలను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.

133/33 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణంపై అనుమానాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement