ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు
గార్ల : ఆటో అదుపుతప్పి బోల్తా పడటానికి కారకుడైన ఆటోడ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బి.సాయికుమార్ శనివారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం తనికెళ్ల గ్రామానికి చెందిన కొల్లూరి సత్యం, బయ్యారం గ్రామంలో బంధువుల దశదినకర్మకు వెళ్లేందుకు అదే గ్రామానికి చెందిన నరసింహరావు ఆటోను కిరాయికి పిలిచారు. ఆటోలో 8మంది బయ్యారానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో గార్ల మండలం దుబ్బగూడెంలో మూలమలుపు వద్ద ఆటోను అతివేగంగా నడుపుతుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో కొల్లూరి రాజ్యంతో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స త్యం ఫిర్యాదు మేరకు ఆటోడ్రైవర్‌పై కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
విద్యుత్ స్తంభం ఎక్కి యువకుడి హల్‌చల్
తొర్రూరు రూరల్ : కుటుంబ సమస్యలతో మనస్తాపం చెందిన ఓ యువకుడు మండలంలోని వెలికట్ట శివారులో విద్యుత్ స్తంభం ఎక్కి శనివారం హాల్‌చల్ చేశాడు. ఎస్సై మహేందర్‌రెడ్డి వెంటనే అక్కడికి చేరుకొని స్తంభంపై ఉన్న రాయపర్తి మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన ఎస్‌కే యాకూబ్‌పాషాకు సర్ది చెప్పి కిందికి దింపి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
గుడుంబా స్వాధీనం
డోర్నకల్ : మండలంలోని పెరుమాళ్లసంకీస గ్రామంలో శనివారం మహబూబాబాద్ పోలీసులు దాడులు చేసి గుడుంబాను స్వాధీనం చేసుకున్నామని ఎకై ్సజ్ సీఐ రాంప్రసాద్ తెలిపారు. గ్రామంలోని కనకం వెంకటమ్మ, కన్నం ఉపేంద్ర ఇళ్లపై దాడి చేసి 8లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని ఇద్దరిని డోర్నకల్ తహసీల్దార్ కార్యాలయంలో బైండోవర్ చేసినట్లు సీఐ తెలిపారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్సై శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ లలితారాణి, కానిస్టేబుళ్లు రియాజ్, బలరాం పాల్గొన్నారు.
పేకాట శిబిరంపై దాడి
దంతాలపల్లి : పేకాట శిబిరంపై దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేసినట్లు శనివారం ఎస్సై రవికుమార్ తెలిపారు. మండలంలోని తూర్పుతండా శివారులో పేకాట ఆడుతూ ముగ్గురు పట్టుబడ్డారని తెలిపారు. నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు.
గంజాయి విక్రయదారుల అరెస్ట్
తొర్రూరు : గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు తొర్రూరు డీఎస్పీ కృష్ణకిషోర్ తెలిపారు. శనివారం డివిజన్ కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో అరెస్టు వివరాలను తెలిపారు. వరంగల్‌కు చెందిన పెండ్యాల అక్షయ్, హనుమకొండకు చెందిన చరణ్ కొన్ని నెలలుగా తొర్రూరు, వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. తొర్రూరుకు చెందిన వారు పక్క సమాచారం ఇవ్వగా, పెండ్యాల అక్షయ్, చరణ్‌ను అదుపులోకి తీసుకోని వారి వద్ద నుంచి 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. సీఐ గణేష్, ఎస్సైలు మహేందర్‌రెడ్డి, ఖాదర్‌పాషా పాల్గొన్నారు.
గుడుంబా తయారు చేయొద్దు
నెల్లికుదురు : నల్లబెల్లం విక్రయించినా.. గుడుంబా తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని కేసముద్రం సీఐ వై.సత్యనారాయణ హెచ్చరించారు. శనివారం మండలంలోని బడితండాలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అక్రమంగా నిల్వచేసిన 60 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోని 500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఎస్సైలు కరుణాకర్, క్రాంతికిరణ్, నరేష్ నెల్లికుదురు, కేసముద్రం, ఇనుగుర్తి పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.


