మార్కెట్‌ సదుపాయం కల్పించండి | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ సదుపాయం కల్పించండి

Nov 29 2026 2:05 PM | Updated on Nov 29 2026 2:05 PM

● అగ్రికల్చర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీని కోరిన రైతులు

డోర్నకల్‌ : కూరగాయల విక్రయానికి డోర్నకల్‌లో మార్కెట్‌ సదుపాయం కల్పించాలని పలువురు రైతులు కోరారు. మండలంలోని అమ్మపాలెం రైతువేదికలో శనివారం నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో అగ్రికల్చర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేంద్రమోహన్‌ వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా, మండల అధికారులు, రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అమ్మపాలెం గ్రామానికి చెందిన నరేందర్‌, గార్లకు చెందిన జక్కుల మల్లేశం వీసీలో మాట్లాడారు. డోర్నకల్‌లో మార్కెట్‌ ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన అగ్రికల్చర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ.. డోర్నకల్‌లో మార్కెట్‌ సదుపాయం కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్చించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఏఓ విజయచంద్ర, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ యాదగిరి, ఏడీఏ సతీష్‌, మండల వ్యవసాయ అధికారి కె.అనిల్‌కుమార్‌, సర్పంచ్‌లు కపిల రాణి, చిర్ర వీరభద్రం, ఉపసర్పంచ్‌ రాంబాబు పాల్గొన్నారు.

రుణాలు రీషెడ్యూల్‌ చేయాలి

కురవి : కరువు ప్రభావిత మండలాల్లో రైతుల రుణాలను రీషెడ్యూల్‌ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని ఆత్మ కమిటీ చైర్మన్‌ నల్లు సుధాకర్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారులతో కలిసి ప్రత్యేక రైతునేస్తం కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌లో వీక్షించారు. ఏఓ నరసింహరావు, ఏ ఈఓలు రవివర్మ, రజనీకాంత్‌, రమ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement