చిన్నగూడూరు : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీఓ రజని అధ్యక్షతన శనివారం అభివృద్ధి పనుల పురోగతిపై మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మండల ప్రత్యేక అధికారి కిరణ్‌కుమార్ హాజరై ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఆయా శాఖల అధికారులు నివేదికను చదివి వినిపించగా, సర్పంచ్‌లు గ్రామంలోని పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మండల ప్రత్యేక అధికారి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. నీటి ఎద్దడిని తట్టుకునేందుకు గ్రామాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకునేలా సర్పంచ్‌లు, కార్యదర్శులు రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్ పనులు అన్ని మండలాల్లో పూర్తయినప్పటికి చిన్నగూడూరు మండలంలో మాత్రం కాలేదని అసహనం వ్యక్తం చేశారు. ఎంపీఓ రజని మాట్లాడుతూ.. మండలంలోని ఆయా గ్రామాల్లో వీవో భవనాలు ప్రారంభమైనప్పటికీ జయ్యారం, మేఘ్యాతండాలో ఇప్పటివరకు పనులు మొదలు పెట్టలేదన్నారు. 2025–2026కు సంబంధించి ఆడిట్ మీటింగ్‌లు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్, ఎంఈఓ రవికుమార్, ఏఓ భాస్కర్, సర్పంచ్‌లు, అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.


