సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ప్రీ ప్రైమరీ పాఠశాలల ఇన్‌స్ట్రక్టర్లు, ఆయా పోస్టుల నియామక ప్రక్రియపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. రోజుకో తీరు నిబంధనలు, గంటకో ఆదేశాలు ఇస్తూ అర్హులైన అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నారు. అయితే నియామక ప్రక్రియలో ఏ సర్టిఫికెట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారో స్పష్టంగా పొందుపర్చాలని అభ్యర్థులు కోరుతున్నారు. సుదీర్ఘకాలం తర్వాత చేపడుతున్న నియామకాలు కావడంతో రాజకీయ నాయకుల నుంచి కూడా ఒత్తిడి పెరిగిన ట్లు జిల్లా విద్యాశాఖలో చర్చ జరుగుతోంది.
ముందు చెప్పిన అర్హతలు..
ప్రభుత్వ పాఠశాలలకు అనుబంధంగా నిర్వహించే ప్రీప్రైమరీ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులకు అర్హులు, ఎంపిక ప్రక్రియను జిల్లా విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. దీని ప్రకారం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులుగా ప్రకటించారు. ఇంటర్‌తో పాటు డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యత, అదీ లేకపోతే డీఈడీ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ నిబంధనలకు కాకుండా ఇప్పుడు కేవలం ఇంటర్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారని కొందరు అంటుంటే.. డీఈసీఏ సర్టిఫికెట్ కీలకం అని ఇంకొందరు.. డీఈడీ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని మరికొందరు, బీఈడీ ఉన్న వారికి కూడా ప్రాధాన్యత ఉంటుందని మరికొందరు అంటున్నారు.
ఆందోళనలో అర్హులు..
ఉన్నత చదువులు చదివి టీచర్ ఉద్యోగం రాక ఇంటి వద్దనే పనిచేసుకుంటున్న సమయంలో ప్రీప్రైమరీ స్కూల్స్ టీచర్ పోస్టులు పడడంతో అర్హుల్లో ఆశలు చిగురించాయి. అయితే ఒక వైపు అధికా రుల నుంచి స్పష్టత లేకపోవడం, మరోవైపు దళారులు రంగ ప్రవేశం చేసి డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని తిరగడం.. మరో వైపు రాజకీయ నాయకులు మా లీడర్‌తో చెప్పి ఉద్యోగం ఇప్పిస్తామని, ఇప్పటికే జాబితా తయారైందని చెప్పడంతో అన్ని అర్హతలు ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు నియామక ప్రక్రియ ఆలస్యం కావడంతో ఏం జరుగుతుందో అనే భయం కూడా పట్టుకుంది. అధికారులు స్పందించి నియామక ప్రక్రియ వివరాలను స్పష్టంగా పొందుపరిచి అందరికి అందుబాటులో ఉండే బెల్ సైట్‌లో గానీ, డీఈఓ, ఎంఈఓ కార్యాలయాల వద్ద గానీ డిస్‌స్లే చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
ప్రీప్రైమరీ పాఠశాలలు
డిగ్రీ
413
దరఖాస్తులు
ఇంటర్
511
దరఖాస్తులు
ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు
బీటెక్/
పాలిటెక్నిక్
14
దరఖాస్తులు
ఆయా పోస్టులు:76
వచ్చిన దరఖాస్తులు: 428
పీజీ 128 దరఖాస్తులు
●
ప్రీప్రైమరీ పోస్టుల ఎంపికలో తర్జనభర్జన
ఇంటర్, టీటీసీకి ప్రాధాన్యం అంటున్న అధికారులు
ఇంటర్, బీఈడీ ఉన్నచోట పరిస్థితిపై స్పష్టత కరువు
రాజకీయ నాయకుల నుంచి
పెరిగిన ఒత్తిడి
ఆందోళనలో అర్హులైన అభ్యర్థులు
1186
76
నిబంధనల ప్రకారమే నియామకాలు
ప్రీప్రైమరీ స్కూల్ ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులకు పోటీ ఎక్కువగా ఉంది. అయితే రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు జారీచేసిన నిబంధనల ప్రకారమే నియామకాలు జరుగుతాయి. ఆ నిబంధనలకు అనుగుణంగా జిల్లా సెలక్షన్ కమిటీ తుది జాబితా తయారు చేస్తుంది. తయారు చేసిన జాబితాలో ఎటువంటి గోప్యత ఉండదు.
– సత్యనారాయణమూర్తి, డీఈఓ


