ఎమ్మార్పీకే విక్రయించాలి | - | Sakshi
Sakshi News home page

ఎమ్మార్పీకే విక్రయించాలి

Jun 26 2026 6:16 AM | Updated on Jun 26 2026 6:16 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : ఎరువులను ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మితే లైసెన్స్‌లు రద్దు చేస్తామని డీఏఓ విజయచంద్ర హెచ్చరించారు. మహబూబాబాద్‌ పట్టణంలోని వివిధ ఎరువులు, పురుగు మందుల దుకాణాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల దుకాణాల్లోని యూరియా, డీఏపీ, వివిధ రకాలైన కాంప్లెక్స్‌ ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎరువులను ఈ–పాస్‌ మిషన్‌ ద్వారానే అమ్మాలని తెలిపారు. ఈ తనిఖీలో మండల వ్యవసాయ అధికారి ఎస్‌.తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఎకై ్సజ్‌ అధికారిగా కనకదుర్గ

మహబూబాబాద్‌ రూరల్‌: జిల్లా ఎకై ్సజ్‌ అధికారిగా బి.కనకదుర్గ విధుల్లో చేరనున్నారు. ప్రస్తుతం జిల్లా ఎకై ్సజ్‌ అధికారిగా పనిచేస్తున్న బి.కిరణ్‌ భూపాలపల్లి జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హైదరాబాద్‌ నాచారం డిస్టిలరీ అధికారిగా పనిచేస్తున్న బి.కనకదుర్గ బదిలీపై జిల్లా ఎకై ్సజ్‌ అధికారిగా రానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎం.రఘునందన్‌ రావు ఉత్తర్వులు విడుదల చేశారు. కాగా, వ్యక్తిగత కారణాలతో అధికారి కనకదుర్గ విధుల్లో చేరేందుకు విముఖంగా ఉన్నట్లు ప్రచా రం జరుగుతోంది. ఆమె విధుల్లో చేరుతారా లేక ఆమె స్థానంలో మరెవరైనా జిల్లా ఎకై ్సజ్‌ అధికారిగా బదిలీపై వస్తారా అనే అంశం జిల్లా ఎకై ్సజ్‌ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

పిల్లలందరికీ

పోలియో చుక్కలు

నెహ్రూసెంటర్‌: జిల్లాలోని 0 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేలా చర్యలు చేపడుతున్నట్లు డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌ అన్నారు. పల్స్‌పోలియో కార్యక్రమంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమానికి 469 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 76,660 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్‌ శివకుమార్‌, కోఆర్డినేటర్లు స్వామి, పురుషోత్తం, డిప్యూటీ డెమో రాజ్‌కుమార్‌, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

కల్యాణం.. కమనీయం

రేగొండ: కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం గురువారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మ స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతి నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంతరం కల్యాణాన్ని నిర్వహించారు. ఆరగింపుతో కల్యాణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు బుచ్చమచార్యులు, శ్రీనాథచార్యులు, ఆలయ సిబ్బంది శ్రావణ్‌, సుధాకర్‌, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ప్రైవేట్‌ స్కూల్‌ వద్దు.. ప్రభుత్వ స్కూల్‌ ముద్దు

కురవి : ప్రైవేట్‌ స్కూల్‌ వద్దు.. ప్రభుత్వ స్కూల్‌ ముద్దు అనే నినాదంతో మండలంలోని బలపాల శివారు లింగ్యా తండా గ్రామంలో ప్రజలు ముందుకు వచ్చారు. గురువారం తండాకు వచ్చిన పలు ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులను సర్పంచ్‌ మాలోత్‌ స్వరూపహరిలాల్‌ ఆధ్వర్యంలో ఆపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ.. డీఎన్‌టీపీఎస్‌ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని తెలిపారు. ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులు రాకుండా ఆపేస్తామని, ప్రజలు సహకరించాలని సూచించారు. సంక్షేమ పథకాలు పొందే ప్రతీ ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపించాలని తెలిపారు. ఇక నుంచి పిల్లలను ప్రైవేట్‌ బడికి పంపిస్తే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ బడిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement