ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

Jun 26 2026 6:16 AM | Updated on Jun 26 2026 6:16 AM

బచ్చన్నపేట : ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆ త్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొ డవటూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పల్లపు నరేశ్‌ (38) గొర్రెలను కాచుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కుటుంబ పోషణ నిమిత్తం అప్పు చేశాడు. అయితే ఎలా తీర్చాలని కొంతకాలంగా మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఘటనా స్థలిని హెడ్‌ కానిస్టేబుల్‌ బాలయ్య సందర్శించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement