కేయూ క్యాంపస్: వికసిత్ భారత్–2047 లక్ష్యం ఆర్థికాభివృద్ధికి మాత్రమే పరిమితం కాదని, సాంకేతిక పురోగతితో సమగ్రాభివృద్ధి సాధ్యమని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. కేయూలోని కామర్స్‌అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల సెమినార్‌హా ల్‌లో గురువారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర కా మర్స్ అసోసియేషన్ ఏడో వార్షిక సదస్సులో ఆయ న మాట్లాడారు. విలువలే దేశ భవిష్యత్‌ను నిర్దేశిస్తాయని, వికసిత్ భారత్–2047 సాధనలో కామర్స్, మేనేజ్‌మెంట్ విద్య కీలకంగా నిలవనుందన్నారు.
ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం :
బాలకిష్టారెడ్డి, రాష్ట్ర ఉన్నత
విద్యామండలి చైర్మన్
కామర్స్‌మేనేజ్‌మెంట్ విద్య విస్తృత ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి ఆన్‌లైన్‌లో ఆయన మాట్లాడారు. డిగ్రీ, పీజీలో సిలబస్ సంస్కరణలు కొనసాగుతాయని తెలిపారు. రానున్న రెండు మూడు దశాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఉన్నత స్థానానికి చేరుకుంటుందన్నారు. అలాగే, రాష్ట్రం కూడా రైజింగ్ తెలంగాణ దిశగా పురోగమిస్తోందని వివరించారు.
యువతకు ఉపాధికోసం ప్రత్యేక పోర్టల్ : చెన్నప్ప, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలంగాణ కామర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ డి.చెన్నప్ప అన్నారు. 2017లో స్థాపించిన కామర్స్ అసోసియేషన్‌లో ప్రస్తుతం 1,177 మంది సభ్యులు ఉన్నారని వవరించారు. ఉచిత శిక్షణ ద్వారా వందమంది విద్యార్థులకుపైగా ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందారన్నారు. ఎస్‌బీఐ ఆర్‌ఎం బండి మురళీమోహనకృష్ణ, హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్ ఎస్.శ్రీనివాసమూర్తి, కేయూ మాజీ రిజిస్ట్రార్ శంకరయ్య, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహాచారి, సదస్సు సెక్రటరీ పి.వరలక్ష్మి, కామర్స్ డీన్ కె.రాజేందర్, పి.అమరవేణి, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ సెక్రటరీ అకాహ్రాయ్‌జాస్తి, రిటైర్డ్ ఆచార్యులు కృష్ణమాచార్య, రవికుమార్ మాట్లాడారు. సదస్సులో 150 పరిశోధన పత్రాల సారాంశాల (అబ్‌స్ట్రాక్ట్) సంకలనాన్ని విడుదల చేశారు. తెలంగాణ కామర్స్ అసోసియేషన్ వెబ్‌సైట్‌ను కూడా అతిథులు ఆవిష్కరించారు.
కేయూ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి


