సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) లోని ముఖ్య ఘట్టం ఇంటింటి గణన గురువారం నుంచి ప్రారంభం కానుంది. అయితే జిల్లాలో ఈ పక్రియ సజావుగా నిర్వహించేదుకు చేపట్టిన ఓటరు మ్యాపింగ్ 94శాతం పూర్తి చేసుకొని జిల్లాను రాష్ట్రంలోనే ముందు స్థానంలో నిలిపారు. ఓటరును గుర్తించేందుకు ఫాంలు పూర్తి చేసి ఇచ్చేందుకు అన్ని పార్టీల ఏజెంట్లు సిద్ధంగా ఉన్నారు.
నేటి నుంచి..
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) అసలు ప్రక్రియ ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇంటింటి గణనతో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ అక్టోబర్ ఒకటో తేదీన ఓటరు సవరణ తుది జాబితా వరకు సాగనుంది. సర్వేకోసం జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో ఇద్దరు ఆర్డీఓలు ఈఆర్‌ఓలుగా, 12 మంది తహసీల్దార్లు ఏఈఆర్‌ఓలుగా, వీరి పరిధిలో 56 మంది సూపర్ వైజర్లు.. వారి పరిధిలో మొత్తం 555 మంది బీఎల్‌ఓలు పనిచేస్తున్నారు. ఈనెల 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే.. జూలై 31న ముసాయిదా(డ్రాఫ్ట్) ఓటరు జాబితా ప్రచురణ, జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లైమ్స్, అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్ 28 వరకు నోటీసుల జారీ, ఎన్యూమరేషన్ ఫామ్స్‌పై నిర్ణయం.. అభ్యంతరాల పరిష్కారం మొదలైన ప్రక్రియ జరుగుతుంది. అక్టోబర్ ఒకటో తేదీన తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు.
అందరూ అప్రమత్తం..
ఇప్పుడు ఓటరుగా నమోదు చేసుకోకపోతే ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. దీంతో అటు అధికా రులు, ఇటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాగా, ప్రభుత్వ సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సర్వే అధికారులకు చూపించాలి. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు తమ ఉద్యోగ గుర్తింపు కార్డు చూపెట్టవచ్చు. కాగా, బ్యాంకు, పోస్టాఫీసు, ఎల్‌ఐసీ, పీఎస్‌యూ ద్వారా పొందిన కార్డులు, అధికారులు జారీ చేసిన పుట్టినతేదీ సర్టిఫికెట్, విద్యార్హత సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రం, అటవీ హక్కు పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రం, ఎన్‌ఆర్‌సీ, కుటుంబ రిజిస్ట్రేషన్, పట్టేదారు పాస్ పుస్తకం, ఆధార్‌కార్డు చూపించి ధ్రువీకరించుకోవచ్చు. అయితే బీఎల్‌ఓలు ముందుగా ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదు పత్రం అందజేస్తారు. వీటిని పూర్తి చేసి ఓటరు నేరుగా గానీ, రాజకీయ పార్టీల ఏజెంట్ల ద్వారా గానీ బూత్‌లెవల్ ఆఫీసర్‌కు అప్పగించాలి. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ప్రత్యేక వెట్‌సైట్‌లో ఏరోజు ఫాంను ఆరోజుగా స్కాన్ చేసి ఆన్‌లైన్ చేయాలి. అయితే ఈ ప్రక్రియపై బీఎల్‌ఓలకు అనేకమార్లు శిక్షణ ఇచ్చినా.. కొందరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రధానంగా కొంత మంది అంగన్‌వాడీ టీచర్లు ఫాంలో వివరాల నమోదు, స్కాన్ చేయడం, అప్‌లోడ్ చేయడం వంటి ప్రక్రియలు చేయలేని పరిస్థితి ఉంది. ఇటువంటి వారికోసం సహాయకులు, సూపర్ వైజర్లు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవస రం ఉంది.
బీఎల్‌ఏలకు నాయకుల
దిశానిర్దేశం
ఒక్క ఓటు గెలుపోటములను తారుమారు చేసే అవకాశం ఉంది. కావునా.. తమ తమ ప్రాంతాల్లో ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా చూసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఇటీవల బీఎల్‌ఏ(బూత్‌లెవల్ ఏజెంట్లు)లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ప్రత్యేక సమీక్షలు నిర్వహించారు. ఫాం ఎలా నింపాలి. ఏ ఆధారాలు చూసుకోవాలి. 2002లోని ఓటరు జాబితాను ఎలా సరిచూడాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు. బీఎల్‌ఓలు.. ఇచ్చిన ఫాం సరి చూడడం, వాటిని దగ్గరుండి భర్తీ చేయడం, తప్పులు ఉంటే సరిచేయడం వంటి పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
555/94%
288/96%
4,84,940
4,57,819
267/91%
2,24,172
2,60,761
2,51,693
2,06,126
మహబూబాబాద్
డోర్నకల్
నేటి నుంచి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ
ఇప్పటికే బీఎల్‌ఓలకు శిక్షణ
ఫాం పూర్తి చేసి ఇస్తేనే ఓటు భద్రం
అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్ల అప్రమత్తం
మ్యాపింగ్ ప్రక్రియ ఇలా..
పీఎస్‌లు ఓటర్లు
మ్యాపింగ్ శాతం


