నెహ్రూసెంటర్: పోలియో రహిత సమాజమే లక్ష్యంగా, పిల్లలకు అంగవైకల్యం రాకుండా ఉండేందుకు 0 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ ప్రభుత్వం పల్స్ పోలియో చుక్కలను పంపిణీ చేస్తోంది. దీనిలో భాగంగా జిల్లాలోని పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. జిల్లాలో 76 వేల మందికి పైగా 5 ఏళ్లలోపు పిల్లలుండగా.. వారికి ఈ నెల 28న పోలియో చుక్కలు వేసేలా వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆరోజు వేసుకోని పిల్లలకు ఈ నెల 29, 30 తేదీల్లో ఇంటింటి సందర్శన ద్వారా పోలియో చుక్కలు వేయనున్నారు.
పిల్లలందరికీ పంపిణీ చేసేలా..
జిల్లాలోని ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు పంపిణీ చేసేలా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తం అవుతున్నారు. 20 పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్, 5 సీహెచ్‌సీలు, బస్తీ దవాఖానా, జీజీహెచ్, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో, అన్ని ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 76వేల కు పైగా చిన్నారులను గుర్తించగా.. వారందరికీ పంపిణీ చేయనున్నారు.
మూడు రోజులు ..
పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న కార్యక్రమాన్ని ప్రారంభించి పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఆరోజు మిగిలిన పిల్లలకు ఈ నెల 29, 30 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటి కార్యక్రమంలో భాగంగా చుక్కల మందు వేస్తారు.
ఈ నెల 28న పోలియో చుక్కల
పంపిణీ
జిల్లాలో 76వేల మందికి పైగా 5 ఏళ్లలోపు పిల్లలు
తప్పనిసరిగా వేయించాలి
ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. పిల్లలు పోలియో వ్యాధి బారిన పడకుంగా, అంగవైకల్యం రాకుండా పోలియో చుక్కలు దోహదం చేస్తాయి. మొదటి రోజు వేసుకోని వారికి వైద్య సిబ్బంది ఇంటింటికీ వచ్చి పోలియో చుక్కలు పింపిణీ చేస్తారు. చిన్నారులు మిస్‌కాకుండా చూసుకోవాలి. – రవిరాథోడ్, డీఎంహెచ్‌ఓ


