భవితకు బంగారు బాట.. | - | Sakshi
Sakshi News home page

భవితకు బంగారు బాట..

Jun 25 2026 1:18 AM | Updated on Jun 25 2026 1:18 AM

ఖానాపురం : ఆ పాఠశాలలో సీటు సాధిస్తే భవిష్య త్‌ బంగారమే. ప్రతీ రోజు ప్రత్యేక కార్యక్రమాలు.. క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసం.. ఉద్యోగావకాశాల కోసం కావాల్సిన శిక్షణ..వెరసి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అదే వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌ గిరిజన సైనిక స్కూల్‌. 1985లో ఏర్పాటు చేసిన ఈ గిరిజన గురుకుల పాఠశాలలో ఎంతో మంది విద్యాభ్యాసం పొందుతూ వస్తున్నారు. 2018లో గిరిజన గురుకుల పాఠశాలను గిరిజన సైనిక్‌స్కూల్‌గా ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో గత ప్రభుత్వంలో సైనిక్‌స్కూ ల్‌ను ప్రారంభించారు. కోట్లాది రూపాయల నిధులు కేటాయించి వసతులు కల్పించడంతో గిరిజన సైనిక్‌స్కూల్‌లో బోధనలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 710 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 40 మంది అధ్యాపకులు, 27 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. సైనిక్‌స్కూల్‌లో సీటు కోసం అనేక మంది విద్యార్థులు పోటీపడుతున్నారు. ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి సీటు పొందుతున్న విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసం, ఉద్యోగ అవకాశాల కోసం కావాల్సిన శిక్షణలు విద్యార్థులకు అందుతున్నాయి.

విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ..

గిరిజన సైనిక పాఠశాలలోని విద్యార్థులకు ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక శిక్షణ కల్పిస్తున్నారు. ఉదయం 5:30 నుంచి 6:30 వరకు, సా యంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఆర్మీ ఉద్యోగా లకు కావాల్సిన శిక్షణను ముగ్గురు రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగులు, ముగ్గురు పీడీల ఆధ్వర్యంలో చేపడుతున్నారు. సమయానికి నిద్రలేవడం, వ్యాయా మం, ఇతర క్రీడా పోటీలు నిర్వహిస్తూ విద్యార్థులు మానసికంగా, శారీరకంగా ధృఢంగా తయారయ్యేలా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటి సుమారు 135 మంది అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

71 మందికి ఉద్యోగాలు..

గిరిజన సైనిక్‌స్కూల్‌లో ప్రవేశాలు పొందిన అనంతరం విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు పడుతున్నాయి. అధ్యాపకులు ప్రత్యేక చొరవతో విద్యార్థులకు బోధన చేపడుతున్నారు. దీంతో ఇప్పటి వరకు 71 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ఇందులో అగ్నివీర్‌లో 46, పోస్టల్‌శాఖలో 9, పోలీస్‌ శాఖలో (కానిస్టేబుల్‌) 5, జీడీ (కానిస్టేబుల్‌)లో 5, నేవీలో 3, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌లో 3, అగ్నిమాపక శాఖలో(ఫైర్‌మెన్‌) 2 చొప్పున ఉద్యోగాలు సాధించారు. వీరితో పాటు ఎన్‌ఐటీ, ఐఐఐటీ, జాతీయ, అంతర్జాతీయ స్పోర్ట్స్‌ యూనివర్సిటీలు, ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థలకు 16 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.

సైనిక్‌ స్కూల్‌.. గిరిజన విద్యార్థులకు వరం

ప్రస్తుతం పాఠశాలలో

710 మంది స్టూడెంట్స్‌

ప్రతీ రోజు ప్రత్యేక శిక్షణలు

ఇప్పటికే వివిధ ఉద్యోగాలు సాధించిన 71 మంది విద్యార్థులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement