కాశిబుగ్గ: వరంగల్ ములుగు రోడ్డులోని సప్తధామంలో 31 జంటలకు ఉచితంగా కల్యాణం నిర్వహించారు. బుధవారం జరిగిన వివాహ మహోత్సవంలో నూతన వధూవరులకు బంగారు పుస్తెలు, వెండి మట్టెలు, బట్టలు, పూజా సామగ్రి అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 19 జంటల నెంది గిరిజనులు, కోయలు, నర్సంపేట, కొత్తగూడెం నుంచి 7 జంటలు, వరంగల్ నుంచి 5 జంటలు పాల్గొన్నట్లు ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ త్రిపురనేని గోపిచంద్ తెలిపారు. వానవాసి కల్యాణ పరిషత్తు జాతీయ అధ్యక్షుడు రామచంద్రయ్య, ఎంఎల్ ధర్మారావు, చాంబర్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, గట్టు మహేష్‌బాబు, సభ్యులు సదాశివుడు, సాయి, ఉమాశంకర్, వెంటకరమణ, భాస్కర్, మహిపాల్, రాంప్రసాద్, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.


