డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు విడుదల

Jun 25 2026 1:18 AM | Updated on Jun 25 2026 1:18 AM

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఏప్రిల్‌–మే నెలలో నిర్వహించిన డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ ఐదు, ఆరో సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, పరీక్షల విభాగం అధికారులు బుధవారం విడుదల చేశారు. ఐదో సెమిస్టర్‌ పరీక్షలకు 12,726 మంది హాజరుకాగా అందులో 5,260మంది విద్యార్థులు ఉత్తీర్ణత (41.33శాతం) సాధించారు. ఆరో సెమిస్టర్‌ పరీక్షలకు 33,205 మంది హాజరుకాగా 16,119 మంది విద్యార్థులు (48.54శాతం) ఉత్తీర్ణత సాధించారని కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్‌ తెలిపారు. కార్యక్రమంలో కేయూ ఓఎస్‌డీ బి. వెంకట్రాంరెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు పి. వెంకటయ్య, తిరుమలాదేవి, నాగరాజు, ఆసిం ఇక్బాల్‌, పి. శ్రీనివాస్‌, పద్మజ, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ రామావెంకటేశ్వర్లు, క్యాంపు ఆఫీసర్‌ నాయకపు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఫలితాలను కేయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.

రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులకు అవకాశం..

డిగ్రీ ఐదు, ఆరో సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన నేపథ్యంలో ఆయా విద్యార్థులు రీవాల్యుయేషన్‌ కోసం దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌ తెలిపారు.15రోజుల్లో రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఫీజులు చెల్లించని కళాశాలల

ఫలితాలు నిలిపివేత..

సుమారు 40 కళాశాలల యాజమాన్యాలు యూనివర్సిటీకి వివిధ రకాల ఫీజులు చెల్లించలేదు. దీంతో ఆయా కళాశాలల విద్యార్థుల ఫలితాలను అధికారులు వెల్లడించలేదు. తమ ఫలితాలు కేయూ వెబ్‌సైట్‌లో కనిపించకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. దీనిపై పలు కళాశాలల యాజమాన్యాలు పరీక్షల విభాగం అధికారులను సంప్రదించారు. ఫీజులు చెల్లించని కళాశాలల విద్యార్థుల ఫలితాలు వెబ్‌సైట్‌లో పెట్టలేదని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. దీంతో సాయంత్రం వరకు సుమారు 10 కళాశాలల వరకు యూనివర్సిటీకి ఫీజులు చెల్లించాయి. ఫలితంగా ఆ కళాశాలల విద్యార్థుల ఫలితాలను వెల్లడించినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌ తెలిపారు. ఇప్పటి వరకూ యూనివర్సిటీకి ఫీజులు చెల్లించని కళాశాలల విద్యార్థుల ఫలితాలు నిలిపివేశామన్నారు.

ఐదో సెమిస్టర్‌లో 41.33 శాతం,

ఆరో సెమిస్టర్‌లో 48.54శాతం ఉత్తీర్ణత

వర్సిటీకి ఫీజులు చెల్లించని కళాశాలల ఫలితాలు నిలిపివేత

రీవాల్యుయేషన్‌ దరఖాస్తులకు

అవకాశం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement