కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పీజీ కోర్సుల్లోని ఆర్ట్స్, సోషల్ సైన్స్ విభాగాలల్లో నూతన కరిక్యులం, సిలబస్‌ను బుధవారం క్యాంపస్‌లోని కమిటీహాల్‌లో నిర్వహించిన ఆర్ట్స్, సోషల్ సైన్స్ విభాగాల అధిపతులు, బీఓఎస్‌లు, డీన్, అధ్యాపకుల సమావేశంలో ఆమోదించారు. వివిధ విభాగాల బీఓఎస్‌లు తమ విభాగాల్లోని నూతన కరిక్యులం, మార్పులు చేసిన సిలబస్ క్రెడిట్స్ గురించి ఈ సందర్భంగా వివరించారు. ఆయా పీజీ కోర్సుల్లోనూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక అంశాలను సిలబస్‌లో ప్రవేశపెడుతున్నట్లు డీన్ బి. సురేశ్‌లాల్ తెలిపారు. ఈ సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆచార్యులు సుధాకర్‌రెడ్డి, విజయ, కేయూ ఓఎస్‌డీ బి. వెంకట్రామ్‌రెడ్డి, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్, ఆర్ట్స్, సోషల్‌సైన్స్ విభాగాల డీన్ బి. సురేశ్‌లాల్, ప్రొఫెసర్ పి. శ్రీనివాస్‌రావు, రాధికారాణి, మేఘనారావు, నిర్మల, దీపాజ్యోతి, కె. వీరస్వామి, చిర్రరాజు, కృష్ణయ్య, స్వర్ణలత పాల్గొన్నారు.
ఆమోదం లభించని సోషల్ వర్క్
పీజీ కోర్సుల సోషల్‌సైన్స్‌లో ఒక్క సోషల్‌వర్క్ విభాగానికి సంబంధించిన నూతన పాఠ్యప్రణాళిక విషయంపై చర్చించిన సందర్భంగా వారానికి రెండు రోజులు ఫీల్డ్‌వర్క్‌కు కేటాయించటంపై ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ సమావేశంలో వ్యతిరేకత వ్యక్తమైనట్లు సమాచారం. దీంతో మళ్లీ ఆ విభాగం ఫీల్డ్ వర్క్ తగ్గించి కరిక్యులం, సిలబస్‌లోమార్పులు చేసుకోవాలని సంబంధిత విభాగం బీఓఎస్‌కు ఇతర ఆచార్యులు సూచించారు. దీంతో సోషల్‌వర్క్‌విభాగానికి సంబంధించి ఈ సమావేశంలో ఆమోదం లభించలేదు. కాగా, ఈవిద్యాసంవత్సరం 2026–2027లోనే ఈ నూతన పాఠ్యప్రణాళికను అమలులోకి తీసుకొస్తారు.


