కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు

Jun 25 2026 1:18 AM | Updated on Jun 25 2026 1:18 AM

ాజీపేట రూరల్‌ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాజీపేట జంక్షన్‌, వరంగల్‌ మీదుగా చర్లపల్లి–తిరుపతి–చర్లపల్లి మధ్య నాలుగు ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ బుధవారం తెలిపారు.

ప్రత్యేక రైళ్ల వివరాలు..

ఈనెల 25, 27వ తేదీల్లో చర్లపల్లిలో 18:10 గంటలకు బయలుదేరే చర్లపల్లి–తిరుపతి (07819) ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట జంక్షన్‌కు 20:00 గంటలకు చేరుకుని మరుసటి రోజు 07:30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ నెల 26, 28వ తేదీల్లో తిరుపతిలో 15:00 గంటలకు బయలుదేరే తిరుపతి–చర్లపల్లి (07820) ఎక్స్‌ప్రెస్‌ కాజీపేటకు మరుసటి రోజు 2:30 గంటలకు చేరుకుని చర్లపల్లికి 04:30 గంటలకు వెళ్తుంది. 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్‌ అండ్‌ జనరల్‌ సెకండ్‌క్లాస్‌ కోచ్‌ల సౌకర్యంతో ఉన్న ఈ రైళ్లకు చర్లపల్లి–తిరుపతి మధ్య అప్‌అండ్‌డౌన్‌ రూట్‌లో జనగామ, కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో హాల్టింగ్‌ కల్పించారు.

క్యాన్సర్‌తో చిన్నారి మృతి

పర్వతగిరిలో విషాదం

మహబూబాబాద్‌ రూరల్‌ : క్యాన్సర్‌(బోన్‌)తో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ హృదయవిదారక ఘటన మహబూబాబాద్‌ మండలం పర్వతగిరిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చెలమల్ల నరేశ్‌, స్రవంతి దంపతుల రెండో కుమార్తె సాయిశృతి (13) నాలుగేళ్ల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతోంది. దీంతో చిన్నారి వైద్యం కోసం తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ చిన్నారి బుధవారం మృతిచెందింది. కాగా, సాయిశృతి మృతితో ఆ కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నేటి నుంచి

28వ తేదీ వరకు రాకపోకలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement