● ఎంజీఎం ఐసీయూ వార్డులో
చికిత్స చేస్తున్న వైద్యులు
● వారం రోజుల క్రితం తీవ్రంగా
గాయపరిచిన కుక్క
కాశిబుగ్గ: వరంగ ల్ లేబర్‌కాలనీ స మీపంలోని శాలి నీనగర్‌లో కుక్కకాటుకు గురైన చిన్నారి పాయల్ ఎంజీఎం ఆస్పత్రిలో కోలుకుంటోంది. శాలినీనగర్‌లో వారం రోజుల క్రితం జరిగిన కుక్కదాడి ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో చిన్నారి పాయల్ ముఖం, ముక్కు, కన్ను, నుదుటిపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈఎన్‌టీ వార్డులో అడ్మిట్ అయిన ఆ చిన్నారికి అత్యవసర చికిత్స అందించడానికి వీలుగా పిల్లల వార్డులోని ఐసీయూలో ఉంచారు. ఈఎన్‌టీ డాక్టర్‌తోపాటు పిల్లల వైద్య నిపుణులు చిన్నారి ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ చికిత్స అందిస్తున్నారు. ఒక దశలో పాయల్ ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉండగా క్రమక్రమంగా కోలుకోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పాయల్ ఆరోగ్యం రికవరీ అవుతోందని, ప్రస్తుతం గాయపడిన చోట వైద్యులు కుట్లు వేసే దిశగా ప్రయత్నిస్తున్నారని ఆర్‌ఎంఓ అశ్వినికుమార్ తెలిపారు. ప్రస్తుతం చిన్నారి ప్రాణాపాయం ఉంచి బయటపడినట్లు ఆయన పేర్కొన్నారు.
కూలిపని కోసం వచ్చి...
పాయల్ కుటుంబం ఛత్తీస్‌గఢ్ నుంచి కూలిపని కోసం వచ్చి శాలినీనగర్‌లోని ఓ ఇంటి నిర్మాణ పనులు చేసున్నట్లు తెలుస్తోంది. రెక్కాడితే గాని డొక్కాడని వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడంతో వారు దాతల కోసం ఎదురు చూస్తున్నారు. ఎంజీఎంలో అన్ని రకాల వైద్యసేవలు వైద్యసేవలు అందుతున్నా ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని వారు వాపోతున్నారు.


