మహబూబాబాద్ రూరల్ : బూత్‌స్థాయి ఏజెంట్లు పార్టీకి వెన్నెముక లాంటి వారని, ప్రతీ ఓటరును కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ అన్నా రు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీఎల్‌ఏల శిక్షణ సమావేశం మంగళవారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు క్యాడర్‌ను సమాయత్తం చేయడమే లక్ష్యంగా బీఎల్‌ఏల శిక్షణ ఏర్పాటు చేశామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి, కార్యకర్తల సంక్షేమానికి తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. బూత్ స్థాయిలో పార్టీ పటిష్టత కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు రామిరెడ్డి, బండి శ్రీను, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


