ప్రభుత్వ పాఠశాలలో ఆడిట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలలో ఆడిట్‌

Jun 24 2026 1:11 AM | Updated on Jun 24 2026 1:11 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో మంగళవారం సోషల్‌ ఆడిట్‌ నిర్వహించారు. ఆడిట్‌ రాష్ట్ర కమిటీ కన్వీనర్‌ సంపత్‌రావు ఆధ్వర్యంలో ముగ్గురు కమిటీ సభ్యులు పాఠశాల సర్వశిక్ష అభియాన్‌ నుంచి వచ్చే నిధులు వినియోగం, వనరులు, సదుపాయాలపై ఆడిట్‌ నిర్వహించారు. పాఠశాలకు వచ్చిన నిధులు, ఖర్చుల గురించి ప్రభుత్వానికి నివేదికను తయారు చేసి అందజేయనున్నారు. ఎంఈఓ శీలం వెంకటేశ్వర్లు, పాఠశాల హెచ్‌ఎం సిరినాయక్‌, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఉచిత కోచింగ్‌

మహబూబాబాద్‌ అర్బన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు అర్హులైన మైనార్టీ విద్యార్థులకు నాలుగు నెలలు పాటు మైనార్టీ స్టడీ సర్కిల్‌ కెరీర్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌ హైదరాబాద్‌ సహకారంతో ఉచిత కోచింగ్‌ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి టీఏవీ.నాగలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రూప్‌–1 నుంచి గ్రూప్‌–4 వరకు, ఎస్‌ఎస్‌సీ, సీజీఎల్‌, యూపీఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌, ఆర్‌ఆర్‌బీ, తెలంగాణ పోలీస్‌ నియామకాలు, ఐబీపీఎస్‌ ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తామన్నారు. అభ్యర్థుల ఏదైనా డిగ్రీ పాసై ఉండాలన్నారు. నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తులను తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్‌ కెరీర్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌, ఇందిర ప్రియదర్శిని కౌన్సెలింగ్‌ సెంటర్‌ నాంపల్లి హైదరాబాద్‌లో నేరుగా విద్యార్థులు అందజేయాలని, పూర్తి వివరాలకు మానుకోట కలెక్టర్‌ కార్యాలయంలో మైనార్టీ ఆఫీస్‌ను సంప్రదించాలన్నారు.

791 పేద కుటుంబాల గుర్తింపు

గంగారం: నీతి ఆయోగ్‌ స్కీంలో మండలంలో 791 పేద కుటుంబాలను కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ గుర్తించి నివేదిక రూపొందించారు. మండలంలోని గుర్తించిన పేద కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు ఇప్పటికే నివేదిక రూపొందించినట్లు సోమవారం సెర్ప్‌ సీఈఓ దివ్య దేవరాజన్‌కు కలెక్టర్‌ వివరించారు.

ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేయాలి

తొర్రూరు: ఆర్టీసీ అభివృద్ధికి సిబ్బంది సహకరించాలని డీఎం ప్రసూనలక్ష్మి కోరారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఎంను మంగళవారం డివిజన్‌ కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. డీఎం మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఈయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎస్‌ కుమార్‌, డిపో కార్యదర్శి జిలుకర యాదగిరి, నాయకులు ఎంకే రావు, సతీష్‌, సత్తయ్య, వనజ, రాజేశ్వరి, శ్రీలత, రాధిక, ధనుంజయ్‌, టీవై రెడ్డి పాల్గొన్నారు.

హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాలోని ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంధసిరి జ్యోతిబసు, పట్ల మధు డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వివిధ సంక్షేమ హాస్టళ్లను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై 10 రోజులు దాటినా విద్యార్థులందరూ రాకపోవడంతో సంక్షేమ హాస్టళ్లు వెలవెలబోతున్నాయన్నారు. సరైన మరుగుదొడ్లు, బాతురూమ్‌లు, తలుపులకు కిటికీలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గురుకుల పాఠశాలల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు, హాస్టళ్లను జిల్లా అధికారులు సందర్శించి సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండ్ల రాకేష్‌, చందు, విక్రమ్‌, వినోద్‌, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement