మరిపెడ రూరల్: కేజీబీవీ విద్యార్థినులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను అందిపుచ్చుకొని చదువులో రాణించాలని జీఈసీఓ గాయత్రి అన్నారు, మంగళవారం మరిపెడ మండలం గుండెపూడి శివారు కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, టాయిలెట్స్, పాఠశాల ఆవరణ పరిశుభ్రతను ఆమె పరిశీలించారు. ఉదయం అల్పాహారం ప్రారంభంతో పాటు ప్రార్థన సమయంలో పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు అందించారు. ఈ ఏడాది 6వ తరగతిలో కొత్తగా చేరిన విద్యార్థులకు చెలిమి ప్రోగ్రామ్స్‌తో పాటు ఎస్‌బీ ద్వారా ప్రత్యక్ష బోధన, ఖాన్ అకాడమీ ద్వారా విద్య, సైన్స్ ల్యాబోరేటరీ, గ్రంథాలయం వినియోగం, క్రీడలు, వివిధ రంగాల్లో తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం సీఆర్టీలతో మాట్లాడుతూ.. పాఠశాల టైం టేబుల్ సిద్ధం చేసుకుని విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఓ చాందిని, సీఆర్‌టీలు పాల్గొన్నారు.


