సమస్యల పరిష్కారానికే ప్రజావాణి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

Jun 23 2026 1:34 AM | Updated on Jun 23 2026 1:34 AM

తొర్రూరు ఆర్డీఓ గణేష్‌

తొర్రూరు: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తొర్రూ రు ఆర్డీఓ గణేష్‌ అన్నారు. సోమవారం డివిజన్‌ కేంద్రంలోని రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో ప్రజా వాణి నిర్వహించి, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ప్రజల నుంచి తీసుకుంటున్న దరఖాస్తులను నెలరోజుల్లో పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రతీవారం నిర్వహించే ప్రజావాణిలో మండలస్థాయి అన్నిశాఖల అధికారులు హాజరు కావాలన్నారు. డీఎల్‌పీఓ పుల్లారావు, లేబర్‌ ఆఫీసర్‌ రవి, ఏటీడబ్ల్యూ ఉపేందర్‌, డిప్యూటీ ఈఈ రంజిత్‌నాయక్‌, సీడీపీఓ రేష్మ, మిషన్‌ భగీరథ డిప్యూటీ ఈఈ మోహన్‌ ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement